మొదటి రోజే మిలియన్ క్లబ్

వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజైన సైరా సినిమాకు అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుందని అంతా అంచనా వేస్తున్నారు. అయితే అంతకంటే ముందే ఓవర్సీస్ లో రికార్డు నమోదైంది. విడుదలైన మొదటి రోజే మిలియన్ డాలర్ క్లబ్ లో చేరింది సైరా. అవును.. ప్రీమియర్స్ తో కలుపుకొని మొదటి రోజే 10 లక్షల డాలర్లు కొల్లగొట్టింది సైరా సినిమా. ఉత్తర అమెరికా, కెనడా వసూళ్లను కలుపుకుంటే […]

Advertisement
Update: 2019-10-03 02:36 GMT

వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజైన సైరా సినిమాకు అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుందని అంతా అంచనా వేస్తున్నారు. అయితే అంతకంటే ముందే ఓవర్సీస్ లో రికార్డు నమోదైంది. విడుదలైన మొదటి రోజే మిలియన్ డాలర్ క్లబ్ లో చేరింది సైరా.

అవును.. ప్రీమియర్స్ తో కలుపుకొని మొదటి రోజే 10 లక్షల డాలర్లు కొల్లగొట్టింది సైరా సినిమా. ఉత్తర అమెరికా, కెనడా వసూళ్లను కలుపుకుంటే ఇంత మొత్తం అయింది. ప్రీమియర్స్ తో ఈ సినిమాకు 8 లక్షల 17వేల డాలర్లు రాగా, మిగిలిన మొత్తాన్ని మొదటి రోజు కలెక్ట్ చేసింది. అయితే ఇది కేవలం కొన్ని ప్రాంతాలకు సంబంధించిన లెక్క మాత్రమే. మరో 54 సెంటర్ల నుంచి వివరాలు అందాల్సి ఉంది. అవి కూడా జోడిస్తే వసూళ్లు మరింత పెరుగుతాయి.

ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బాహుబలి-2 రికార్డుల్ని తిరగరాస్తుందని భావిస్తున్నారు. కృష్ణా ఏరియాలో సైరా సినిమాను ఆల్ టైమ్ హిట్ గా చెబుతున్నారు. అధికారికంగా ఇంకా ప్రకటన రావాల్సి ఉంది. ఇక నైజాంలో కూడా సైరా ఎంత కలెక్ట్ చేసిందనేది ఆసక్తికరంగా మారింది. అటు ఉత్తరాదిన మాత్రం ఈ సినిమా పెద్దగా వసూళ్లు సాధించలేకపోయింది. వార్ సినిమా ప్రభావం సైరాపై గట్టిగా పడింది.

Tags:    
Advertisement

Similar News