ప్రచారానికి వాడుకున్నారు.. ట్రయిలర్ లో లేపేశారు!

కొన్ని రోజుల కిందటి మాట.. గ్యాంగ్ లీడర్ టైటిల్ ఎనౌన్స్ మెంట్ ను కొత్తగా చేశారు. ఓ ఎంక్వయిరీలో కమెడియన్ సత్య గ్యాంగ్ లీడర్ పేరును బయటపెడతాడు. ఆ వీడియో బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఫస్ట్ లుక్ లో కూడా సత్యను బాగానే వాడుకున్నారు. ఆ వీడియో కూడా క్లిక్ అయింది. గ్యాంగ్ లీడర్ ప్రచారానికి ఇంతగా పనికొచ్చిన సత్య, ఆ సినిమా ట్రయిలర్ కు మాత్రం పనికిరాలేదు. అవును.. ఈరోజు […]

Advertisement
Update: 2019-08-28 05:20 GMT

కొన్ని రోజుల కిందటి మాట.. గ్యాంగ్ లీడర్ టైటిల్ ఎనౌన్స్ మెంట్ ను కొత్తగా చేశారు. ఓ ఎంక్వయిరీలో కమెడియన్ సత్య గ్యాంగ్ లీడర్ పేరును బయటపెడతాడు. ఆ వీడియో బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఫస్ట్ లుక్ లో కూడా సత్యను బాగానే వాడుకున్నారు. ఆ వీడియో కూడా క్లిక్ అయింది. గ్యాంగ్ లీడర్ ప్రచారానికి ఇంతగా పనికొచ్చిన సత్య, ఆ సినిమా ట్రయిలర్ కు మాత్రం పనికిరాలేదు. అవును.. ఈరోజు రిలీజైన గ్యాంగ్ లీడర్ ట్రయిలర్ లో సత్య లేడు.

ట్రయిలర్ లో సినిమా కథ, కాన్సెప్ట్ మొత్తం చెప్పేశారు. హీరో, విలన్, హీరోయిన్ ను పరిచయం చేశారు. కానీ ప్రచారం కోసం వాడుకున్న సత్యను మాత్రం ఒక్క ఫ్రేమ్ లో కూడా చూపించలేదు. ఇప్పటివరకు సీన్ లో లేని ప్రియదర్శి కూడా ట్రయిలర్ లో కనిపించాడు గానీ సత్యకు మాత్రం చోటు దక్కలేదు.

అన్నట్టు ట్రయిలర్ లోనే కాదు, టీజర్ లో కూడా సత్య లేడు. టీజర్ అనేది కేవలం హీరో ఎలివేషన్, ఇతర పాత్రల పరిచయానికే కాబట్టి సత్య లేడని సరిపెట్టుకున్నారు అప్పట్లో. కానీ ట్రయిలర్ లో కూడా సత్య లేడు. దీంతో అసలు గ్యాంగ్ లీడర్ సినిమాలో సత్య ఉన్నాడా లేదా అనుమానం కూడా జనాల్లో ఎక్కువైంది. కేవలం సినిమా ప్రమోషన్ కే అతడ్ని వాడుకున్నారా లేక సినిమాలో అతడితో మంచి కమెడీ ట్రాక్ కూడా సెట్ చేశారా అనేది చూడాలి.

ఇక ట్రయిలర్ విషయానికొస్తే.. కంటెంట్ బాగున్నప్పటికీ చాలా లెంగ్తీగా ఉందనే కామెంట్ వినిపించింది. పైగా కామెడీ బాగుంటుందని ఓవైపు చెబుతూ, ట్రయిలర్ లో కామెడీ పంచ్ లు పెట్టకపోవడం నిరాశపరిచింది. సెప్టెంబర్ 13న థియేటర్లలోకి వస్తోంది గ్యాంగ్ లీడర్.

Tags:    
Advertisement

Similar News