ప్రతి రోజు పంచాయితీ.... అసలేం జరుగుతోంది?

పెద్ద సినిమాల సంగతి పక్కనపెడితే, చిన్న సినిమాలకు కచ్చితంగా ప్రచారం కావాలి. లేదంటే జనాల్లోకి చొచ్చుకుపోవడం కష్టం. అందుకే చిన్న సినిమాలకు ఎంత బడ్జెట్ కేటాయిస్తారో, దాదాపు అంతే బడ్జెట్ ను ప్రచారానికి కూడా కేటాయిస్తారు. కానీ ‘కథనం’ సినిమా విషయంలో మాత్రం ఎక్కడో తేడా కొడుతోంది. అనసూయ లీడ్ రోల్ పోషించిన ఈ సినిమాకు అస్సలు ప్రచారం లేదు. రిలీజ్ కి 2 రోజుల ముందు కూడా కనీసం మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం లేదు. […]

Advertisement
Update: 2019-08-08 00:03 GMT

పెద్ద సినిమాల సంగతి పక్కనపెడితే, చిన్న సినిమాలకు కచ్చితంగా ప్రచారం కావాలి. లేదంటే జనాల్లోకి చొచ్చుకుపోవడం కష్టం. అందుకే చిన్న సినిమాలకు ఎంత బడ్జెట్ కేటాయిస్తారో, దాదాపు అంతే బడ్జెట్ ను ప్రచారానికి కూడా కేటాయిస్తారు.

కానీ ‘కథనం’ సినిమా విషయంలో మాత్రం ఎక్కడో తేడా కొడుతోంది. అనసూయ లీడ్ రోల్ పోషించిన ఈ సినిమాకు అస్సలు ప్రచారం లేదు. రిలీజ్ కి 2 రోజుల ముందు కూడా కనీసం మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం లేదు.

అనసూయతో ఇంటర్వ్యూ ఉందంటూ ప్రతి రోజూ మీడియాకు మెసేజీలు రావడం, ఆ వెంటనే ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయిందంటూ మరో మెసెజీ రావడం కామన్ అయిపోయింది. ప్రతి రోజూ ఇదే తంతు. రిలీజ్ కు ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ఓవైపు నాగార్జున ప్రచారంతో ఊదరగొడుతున్నాడు. పోటీగా అలాంటి పెద్ద సినిమాను పెట్టుకొని మరీ అనసూయ మాత్రం మీడియా ముందుకురావడం లేదు.

పోనీ సినిమాకు సంబంధించి వేరేవాళ్లను మీడియా ముందుకు తీసుకొద్దామంటే అది జరిగే పని కాదు. అనసూయ సినిమాకు సంబంధించి ఆమె కాకుండా ధనరాజ్, వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్ లాంటి నటులు ఇంటర్వ్యూలు ఇస్తే ఎవ్వరూ పట్టించుకోరు. అసలు వ్యక్తి అనసూయ మాత్రం ఈ సినిమాకు సంబంధించి అస్సలు బయటకు రావడం లేదు.

అసలు ఏం జరుగుతోంది? యూనిట్ కు అనసూయకు పడడం లేదా? లేక ఆర్థిక వ్యవహారాలు ఇంకా తెగలేదా? ఇలా అనసూయపై, కథనం సినిమాపై ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News