హిందీ 'జెర్సీ'.... గౌతమ్ దే !

ఇప్పటికే జెర్సీ సినిమా రీమేక్ గురించి చర్చ సినిమా పరిశ్రమ లో నడుస్తుంది. అయితే ఈ రోజు కి కూడా ఈ విషయమై ఒక క్లారిటీ లేదు. సాధారణం గా ఒక సినిమా తెలుగు లో హిట్ కాగానే వేరే భాషల నుండి దర్శక నిర్మాతలు వచ్చి రీమేక్ రైట్స్ కోసం ఎగబడుతూ ఉంటారు. జెర్సీ విషయం లో కూడా అదే జరిగింది. తమిళం లో ఈ సినిమాని… విష్ణు విశాల్ హీరో గా రానా నిర్మించాలి […]

Advertisement
Update: 2019-07-16 00:36 GMT

ఇప్పటికే జెర్సీ సినిమా రీమేక్ గురించి చర్చ సినిమా పరిశ్రమ లో నడుస్తుంది. అయితే ఈ రోజు కి కూడా ఈ విషయమై ఒక క్లారిటీ లేదు.

సాధారణం గా ఒక సినిమా తెలుగు లో హిట్ కాగానే వేరే భాషల నుండి దర్శక నిర్మాతలు వచ్చి రీమేక్ రైట్స్ కోసం ఎగబడుతూ ఉంటారు. జెర్సీ విషయం లో కూడా అదే జరిగింది.

తమిళం లో ఈ సినిమాని… విష్ణు విశాల్ హీరో గా రానా నిర్మించాలి అని అనుకుంటున్నారట. అయితే హిందీ రీమేక్ కి సంబంధించి ఒక ఆసక్తికర అంశం బయటకు వచ్చింది.

ఇప్పటికే దిల్ రాజు ఈ సినిమా ని హిందీ లో నిర్మిస్తారనే వార్త బయటకి వచ్చిన నేపథ్యం లో… ఇప్పుడు దిల్ రాజు తో కలిసి ఈ సినిమా ని అల్లు అరవింద్ కూడా హిందీ లో నిర్మిస్తారట.

తెలుగు లో సినిమా ని నిర్మించిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ కూడా నిర్మాణం లో భాగస్వాములు అవుతారని చెబుతున్నారు. అయితే ఆసక్తికరంగా తెలుగు లో ఈ సినిమాకి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరే హిందీ లో కూడా డైరెక్ట్ చేయనున్నాడట.

కబీర్ సింగ్ హిట్ అయ్యాక…. రీమేక్ సినిమాలను ఒరిజినల్ డైరెక్టర్స్ చేస్తేనే బాగుంటుంది అనే అభిప్రాయం ఏర్పడింది. కాబట్టి గౌతమ్ ఈ సినిమా తో హిందీ పరిశ్రమ లోకి అడుగు పెడుతున్నాడని చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News