చింతమనేని జంప్‌.... బీజేపీ నేతతో భేటీ

టీడీపీ వివాదాస్పద మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ టీడీపీని వీడేందుకు సిద్దమవుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఆయన చర్యలు కూడా అందుకు బలాన్నిస్తున్నాయి. ఏపీలో టీడీపీ కోలుకోవడం కష్టమన్న భావనతో ఉన్న చింతమనేని ప్రభాకర్‌ బీజేపీ వైపు చూస్తున్నారన్న వార్తలు ఇటీవల వచ్చాయి. తాజాగా చింతమనేని ప్రభాకర్ … విజయవాడలో బీజేపీ నేత విష్ణుకుమార్‌ రాజుతో ఒక హోటల్‌లో రహస్యంగా సమావేశం అయ్యారు. ఇద్దరూ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. బీజేపీలో చేరే అంశంపైనే ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్టు […]

Advertisement
Update: 2019-07-13 10:26 GMT

టీడీపీ వివాదాస్పద మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ టీడీపీని వీడేందుకు సిద్దమవుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఆయన చర్యలు కూడా అందుకు బలాన్నిస్తున్నాయి. ఏపీలో టీడీపీ కోలుకోవడం కష్టమన్న భావనతో ఉన్న చింతమనేని ప్రభాకర్‌ బీజేపీ వైపు చూస్తున్నారన్న వార్తలు ఇటీవల వచ్చాయి.

తాజాగా చింతమనేని ప్రభాకర్ … విజయవాడలో బీజేపీ నేత విష్ణుకుమార్‌ రాజుతో ఒక హోటల్‌లో రహస్యంగా సమావేశం అయ్యారు. ఇద్దరూ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

బీజేపీలో చేరే అంశంపైనే ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్టు భావిస్తున్నారు. చింతమనేని ప్రభాకర్‌పై 30కిపైగా కేసులున్నాయి. కొన్నింటిలో శిక్ష కూడా పడగా బెయిల్‌పై తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి వెళ్తే రక్షణ దొరుకుతుందని చింతమనేని భావిస్తున్నట్టు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News