3వేల వీడియోలు.. దేవగౌడ మనవడి 'సెక్స్ స్కాండల్'

అమ్మాయిలకు తెలియకుండా వీడియోలు తీసి, వాటి ఆధారంగా వారిని బెదిరించి ప్రజ్వల్ రేవణ్ణ లొంగదీసుకున్నాడని ఆరోపణలు వస్తున్నాయి.

Advertisement
Update: 2024-04-29 10:01 GMT

హసన ఎంపీ, JDS యువనేత ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల‌ వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. మాజీ ప్రధాని దేవెగౌడకు స్వయానా మనవడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అన్న కుమారుడైన ప్రజ్వల్.. యువతులను ప్రలోభాలకు గురిచేసి, లైంగిక దాడి చేశారనే ఆరోపణలు సంచలనంగా మారాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలకలం రేగింది. తాజాగా ఈ కేసులో మరో సంచలనం బయటపడింది. ప్రజ్వల్‌పై లైంగిక దాడి కేసు పెట్టిన బాధిత మహిళ (47).. ఆయనకు బంధువే. ప్రజ్వల్ తల్లి భవానీకి ఆమె మేనత్త కుమార్తె.

అమ్మ ఇంట్లో లేని సమయంలో..

రేవణ్ణ మంత్రిగా ఉన్నప్పుడు బాధిత మహిళకు పాల కేంద్రంలో పని ఇప్పించారు. అనంతరం బీసీఎం హాస్టల్‌లో వంట మనిషిగా అవకాశం కల్పించారు. 2015లో ఆమెను వారి ఇంట్లో పనికి చేర్పించారు. రేవణ్ణ నివాసంలో ఆరుగురు మహిళలు, యువతులు పని చేస్తున్నారని బాధిత మహిళ కంప్లెయింట్‌లో పేర్కొంది. ఇంట్లో చేరిన 4 నెలల నుంచి తనను లైంగికంగా వేధిస్తున్నాడ‌ని, తల్లి ఇంట్లోలేని సమయంలో తనపై లైంగిక దాడి చేసేవాడని బాధితురాలు ఆరోపించింది. తన కుమార్తెకు కూడా వీడియో కాల్‌ చేసి ప్రజ్వల్‌ అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. తర్వాత తాను పని విడిచిపెట్టి బయటకు వచ్చేశానని.. వీడియోలు బయటకు రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఫిర్యాదు చేస్తున్నానని వెల్లడించింది.

అమ్మాయిలతో 3వేల వీడియోలు..

మరోవైపు, అమ్మాయిలకు తెలియకుండా వీడియోలు తీసి, వాటి ఆధారంగా వారిని బెదిరించి ప్రజ్వల్ రేవణ్ణ లొంగదీసుకున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. ఏకంగా మూడు వేల వీడియోలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ప్రజ్వల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై విచారణకు కర్ణాటక ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.

Tags:    
Advertisement

Similar News