నువ్వూ నీ చెత్త కెప్టెన్సీ.. కేఎల్‌ రాహుల్‌ను గ్రౌండ్‌లోనే ఉతికారేసిన ఓనర్

ఘోర ఓటమిని చూసిన లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్‌ సంజీవ్ గోయెంకాకు తిక్కరేగింది. మ్యాచ్‌ అనంతరం కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశాడు.

Advertisement
Update: 2024-05-09 03:44 GMT

బుధవారం జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది లక్నో సూపర్ జెయింట్స్. దీంతో ప్లే ఆఫ్స్ అవకాశాలు కష్టంగా మారాయి. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో బాగా ఇబ్బంది పడింది. 20 ఓవర్లలో 165 పరుగులే చేసింది. కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ 33 బాల్స్‌లో 29 రన్స్‌తో జిడ్డు బ్యాటింగ్ చేశాడు. ఛేజింగ్‌కు దిగిన సన్ రైజర్స్ ఓపెనర్లు వికెట్ పోకుండానే టార్గెట్ ఫినీష్ చేశారు. కేవలం 9.4 ఓవర్లలోనే 167 పరుగులు చేశారు. వరుసగా రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడిన లక్నో.. ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

వైరల్ అవుతున్న వీడియో..

ఘోర ఓటమిని చూసిన లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్‌ సంజీవ్ గోయెంకాకు తిక్కరేగింది. మ్యాచ్‌ అనంతరం కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశాడు. లక్షలాది మంది జనం, వందల కెమెరాలు చూస్తుండగానే నిల్చోబెట్టి క్లాస్‌ పీకాడు. రాహుల్‌ కూడా ఏం మాట్లాడలేదు. కోచ్ జస్టిన్ లాంగర్‌ రాగానే నిరాశగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇపుడీ వీడియో వైరల్‌గా మారింది. లక్నో టీమ్‌ ఓనర్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గేమ్ అన్నాక గెలుపు, ఓటములు సహజం. ఏదైనా ఉంటే డ్రెస్సింగ్‌ రూమ్‌లో మాట్లాడుకోవాలి. కానీ ఇలా అందరిముందు అవమానించడం కరెక్ట్ కాదుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News