ఇద్దరు భార్యలున్నవారికి రూ.2 లక్షలు ఇస్తాం - దుమారం రేపిన కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు

మధ్యప్రదేశ్ కు చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు కూడా ఎన్నికల ప్రచారంలో ప్రజలకు వాగ్దానాలు ఇచ్చే క్రమంలో హద్దులు దాటారు. 'ఇద్దరు భార్యలు ఉన్నవారికి 2 లక్షల రూపాయల చొప్పున ఇస్తామని' ప్రకటించి రాజకీయ దుమారాన్ని సృష్టించారు.

Advertisement
Update: 2024-05-10 05:48 GMT

ఎన్నికల ప్రచారంలో నాయకుల హామీలు కోటలు దాటుతుంటాయి. ఆచరణకు సాధ్యం కాని విధంగా అలివికాని హామీలు గుప్పిస్తుంటారు. ఒక్కోసారి వాళ్లేం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కాని విధంగా ప్రవర్తిస్తుంటారు. మధ్యప్రదేశ్ కు చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు కూడా ఎన్నికల ప్రచారంలో ప్రజలకు వాగ్దానాలు ఇచ్చే క్రమంలో హద్దులు దాటారు. 'ఇద్దరు భార్యలు ఉన్నవారికి 2 లక్షల రూపాయల చొప్పున ఇస్తామని' ప్రకటించి రాజకీయ దుమారాన్ని సృష్టించారు.

మధ్యప్రదేశ్ కు చెందిన కేంద్ర మాజీ మంత్రి కాంతిలాల్ భూరియా రత్లాం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన నియోజకవర్గంలోని సైలానాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఓ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి యోజన పథకం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పేద కుటుంబాలకు చెందిన మహిళలకు ఈ పథకంలో భాగంగా ఏటా రూ. లక్ష అందజేస్తుందని చెప్పారు. ఈ పథకంలోని మరిన్ని అంశాలను చెప్పే క్రమంలో కాంతిలాల్ భూరియా తన నోరు అదుపుతప్పారు. ఒక భార్య ఉన్నవారికి రూ.లక్ష, ఇద్దరు భార్యలు ఉన్నవారికి రూ. రెండు లక్షలు ఇస్తామని ప్రకటించారు. మహాలక్ష్మి యోజన పథకంలో భాగంగా ఒక్కో మహిళకు రూ. లక్ష చొప్పున ఇస్తామని చెప్పాల్సి ఉండగా.. ఇద్దరు భార్యలు ఉన్న వారికి రెండు లక్షల రూపాయలు ఇస్తామని కాంతిలాల్ భూరియా చేసిన ప్రకటన రాజకీయ దుమారాన్ని సృష్టించింది.

ఇదిలా ఉంటే భూరియా చేసిన ప్రకటనకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ మద్దతు తెలపడంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. కాగా, భూరియా చేసిన ప్రకటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఆయన ప్రకటన ఇద్దరు భార్యల విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా ఉందని మండిపడింది. భూరియాపై తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ను కోరింది.

Tags:    
Advertisement

Similar News