నాని చెబుతున్న షో మాస్టర్ లోకేషేనా?

విజయవాడ ఎంపీ కేశినేని నాని ఏదో తెలియని బాధతో… టీడీపీలో బాధపడుతూ బతుకుతున్నట్టుగా ఉంది. 2014 నుంచి 2019 వరకు నాయకత్వాన్ని విమర్శించని నాని… ఇటీవల పదేపదే నాయకత్వంపై పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. అది కూడా ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ ద్వారా టీడీపీ పెద్దలను ఎత్తిపొడుస్తున్నారు. తాజాగా టీడీపీకి కావాల్సింది షో మాస్టర్లు కాదు… టాస్క్ మాస్టర్లు కావాలి…. అంటూ ట్వీట్ పెట్టారు. ఈ ట్వీట్ చర్చనీయాంశమైంది. TDP now requires task masters not show masters […]

Advertisement
Update: 2019-07-08 21:52 GMT

విజయవాడ ఎంపీ కేశినేని నాని ఏదో తెలియని బాధతో… టీడీపీలో బాధపడుతూ బతుకుతున్నట్టుగా ఉంది. 2014 నుంచి 2019 వరకు నాయకత్వాన్ని విమర్శించని నాని… ఇటీవల పదేపదే నాయకత్వంపై పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు.

అది కూడా ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ ద్వారా టీడీపీ పెద్దలను ఎత్తిపొడుస్తున్నారు. తాజాగా టీడీపీకి కావాల్సింది షో మాస్టర్లు కాదు… టాస్క్ మాస్టర్లు కావాలి…. అంటూ ట్వీట్ పెట్టారు. ఈ ట్వీట్ చర్చనీయాంశమైంది.

షో మాస్టర్ ఎవరు అన్న దానిపై ఆలోచన చేస్తున్నారు. ఎప్పటిలాగే అందరి దృష్టి లోకేష్‌ వద్దకు వెళ్లి ఆగిపోతోంది. ఇటీవల నారా లోకేష్‌ బయటకు కనిపించడం లేదు గానీ… తన ట్విట్టర్‌ ద్వారా వరుసగా ట్వీట్లు పెట్టిస్తున్నారు…. బయటకు వచ్చి మాట్లాడకుండా ఇలా ట్విట్టర్‌లో ట్వీట్లు పెట్టిస్తే ఏం లాభం అని టీడీపీ నేతలు అసంతృప్తితో ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే నాని పెట్టిన ట్వీట్‌… నారా లోకేష్‌ గురించే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    
Advertisement

Similar News