ఇక ముఖ్యమంత్రి జగన్ ప్రజా దర్బార్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు… అదే ప్రజా దర్బార్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లో ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజలను నేరుగా కలుస్తారు. వారి సాధక బాధకాలను, ఇబ్బందులను నేరుగా తెలుసుకుంటారు. వైయస్సార్ ప్రజా దర్బార్ గా నామకరణం చేస్తున్న ఈ కొత్త కార్యక్రమం ఆగస్టు15వ తేదీ నుంచి కానీ, అక్టోబర్ 2వ తేదీ నుంచి కానీ […]

Advertisement
Update: 2019-06-12 23:34 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు… అదే ప్రజా దర్బార్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లో ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజలను నేరుగా కలుస్తారు. వారి సాధక బాధకాలను, ఇబ్బందులను నేరుగా తెలుసుకుంటారు.

వైయస్సార్ ప్రజా దర్బార్ గా నామకరణం చేస్తున్న ఈ కొత్త కార్యక్రమం ఆగస్టు15వ తేదీ నుంచి కానీ, అక్టోబర్ 2వ తేదీ నుంచి కానీ ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి.

శని, ఆదివారాలు మినహా మిగిలిన అన్ని రోజులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా దర్బార్ ద్వారా ప్రజలను నేరుగా కలుస్తారని అంటున్నారు. ప్రజల నుంచి వచ్చే వినతి పత్రాలను, అభ్యర్థనలను ముఖ్యమంత్రి తీసుకుంటారని, ఆ సమస్యల పరిష్కారం కోసం కొందరు అధికారులతో ఒక సెల్ ను కూడా ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు.

ప్రజలు చేసిన వ్యాఖ్యలపై, వినతులు, విజ్ఞప్తులపై కొత్తగా నియమించే అధికారుల బృందం ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులతో మాట్లాడుతుందని చెబుతున్నారు.

సమస్యల పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులకు కొన్నాళ్లు గడువు ఇస్తారని, అప్పటికి పరిష్కరించకపోతే చర్యలు తీసుకుంటారని చెబుతున్నారు. ఇన్నాళ్లూ కలెక్టర్ లకు మాత్రమే పరిమితమైన గ్రీవెన్స్ సెల్ వంటి ప్రజా దర్బార్ ఇప్పుడు ముఖ్యమంత్రి చేపట్టడం విశేషం అని చెబుతున్నారు. ఈ కార్యక్రమం వల్ల అధికారుల్లో జవాబుదారీతనం పెరగడంతో పాటు ప్రజలకు తమ సమస్యల పరిష్కారం పైనా నమ్మకం ఏర్పడుతుంది అని అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News