పవన్‌ లెక్క.... వాళ్ళకు అర్థం కావడం లేదట

‘నాక్కొంచెం తిక్కుంది…. దానికో లెక్కుంది’ అనేది పవన్‌ కళ్యాణ్‌ పాపులర్‌ డైలాగ్. తిక్కుందో లేదో…. ఎవరు తేలుస్తారో తెలియదు గానీ…. ఆయనకో లెక్కుందని మాత్రం ఆయనే చెప్పేశాడు. సందర్భం ఏమిటీ అంటే…. మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక జనసేనలో పెద్ద నాయకులు కొందరు ఆయనను కలిసి…. పార్టీ అభిమానులను నిలుపుకోవాలంటే ఏం చేస్తే బాగుంటుందని పవన్‌ను అడిగారట. దాంతో పవన్‌కు తిక్కరేగి వాళ్ళు ఉంటే ఎంత? పోతే ఎంత? నన్నే గెలిపించుకోలేని వాళ్ళు పార్టీకేం ఉపయోగపడతారు? అని […]

Advertisement
Update: 2019-06-04 21:52 GMT

‘నాక్కొంచెం తిక్కుంది…. దానికో లెక్కుంది’ అనేది పవన్‌ కళ్యాణ్‌ పాపులర్‌ డైలాగ్.

తిక్కుందో లేదో…. ఎవరు తేలుస్తారో తెలియదు గానీ…. ఆయనకో లెక్కుందని మాత్రం ఆయనే చెప్పేశాడు.

సందర్భం ఏమిటీ అంటే…. మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక జనసేనలో పెద్ద నాయకులు కొందరు ఆయనను కలిసి…. పార్టీ అభిమానులను నిలుపుకోవాలంటే ఏం చేస్తే బాగుంటుందని పవన్‌ను అడిగారట.

దాంతో పవన్‌కు తిక్కరేగి వాళ్ళు ఉంటే ఎంత? పోతే ఎంత? నన్నే గెలిపించుకోలేని వాళ్ళు పార్టీకేం ఉపయోగపడతారు? అని ప్రశ్నించాడట.

దాంతో కంగుతిన్న నాయకులు…. ఈయనేం నాయకుడు? నాయకుణ్ణి చూసి పార్టీ అభ్యర్ధులకు ఓట్లేస్తారు. పార్టీ అభ్యర్ధులను తన చరిష్మాతో, తన నాయకత్వంతో, తన జనాకర్షణతో నాయకుడు గెలిపిస్తాడు…. జగన్‌ను చూసి ఎమ్మెల్యేలకు ఓట్లేశారు గానీ…. పార్టీ అభిమానులను చూసి జగన్‌ను గెలిపించలేదు.

జగన్‌ వల్ల మేమంతా గెలిచాం అని వైసీపీ ఎమ్మెల్యేలంతా అంటుంటే…. పవన్‌ కళ్యాణ్‌ మాత్రం నన్ను కూడా గెలిపించుకోలేని వీళ్ళేం పార్టీ అభిమానులు అనడం నాయకులకు అర్థం కాక అయోమయంలో పడిపోయారు.

Tags:    
Advertisement

Similar News