ఏపీ డీజీపీగా హరీష్‌ కుమార్ గుప్తా

రాజేంద్రనాథ్ రెడ్డిపై ఆదివారం బదిలీ వేటు వేసిన ఈసీ తక్షణమే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Advertisement
Update: 2024-05-06 10:19 GMT

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త డీజీపీని నియమించింది ఎన్నికల క‌మిష‌న్. 1992 బ్యాచ్‌కు చెందిన హరీష్‌ కుమార్‌ గుప్తాను ఏపీ కొత్త డీజీపీగా ఎంపికే చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ.. సాయంత్రం 5 గంటలలోగా బాధ్యతలు తీసుకోవాలని హ‌రీష్‌ను ఆదేశించింది. ప్రస్తుతం హోం శాఖ సెక్రటరీగా ఉన్నారు హరీష్ కుమార్ గుప్తా.



ఇప్పటివరకూ డీజీపీగా కొనసాగిన రాజేంద్రనాథ్ రెడ్డిపై ఆదివారం బదిలీ వేటు వేసిన ఈసీ తక్షణమే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే కొత్త డీజీపీ రేసులో ద్వారకా తిరుమల రావు, మాదిరెడ్డి ప్రతాప్, అంజనా సిన్హా పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కాగా, వారి పేర్లను ఈసీ పరిగణలోకి తీసుకోలేదు. 

Tags:    
Advertisement

Similar News