ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌‌ బ్యాక్‌ ఫైర్.. టీడీపీ గొంతులో పచ్చి వెలక్కాయ

బీజేపీ నేత, ఆ పార్టీ స్టేట్ చీఫ్‌ పురందేశ్వరి సైతం ల్యాండ్ టైట్లింగ్‌ యాక్ట్‌పై వివరణ ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను అమలు చేయాలని నీతిఆయోగ్ సిఫార్సు చేసిందన్నారు.

Advertisement
Update: 2024-05-06 05:09 GMT

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం తిరిగి ఆ పార్టీ మెడకే చుట్టుకుంది. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై టీడీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై ఏపీ సీఐడీ ఇప్పటికే చంద్రబాబు, లోకేష్‌లపై కేసు నమోదు చేయగా.. ఓ సంచలన వీడియోతో తెలుగుదేశంను మరింత ఇరకాటంలోకి నెట్టారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. రామోజీరావుకు చెందిన ఈటీవీలో అన్నదాత కార్యక్రమంలో ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్‌తో జరిగే మేలును వివరిస్తూ గతంలో టెలికాస్ట్ చేసిన ఓ ఎపిసోడ్‌తో పాటు ఏపీ అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను సమర్థిస్తూ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాట్లాడిన వీడియోను సజ్జల బయటపెట్టారు. ఈ వీడియోలతో చంద్రబాబు అండ్ కో గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డంత పనైంది.

భూ కబ్జాలు చేసే చంద్రబాబు లాంటి వాళ్లకు ఇలాంటి చట్టాలు రావడం ఇష్టం ఉండదన్నారు సజ్జల. పచ్చ మీడియా బలంతో చంద్రబాబు ఫేక్‌ ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ల్యాండ్ టైట్లింగ్‌ యాక్ట్‌ భూములను రక్షించే చట్టమన్నారు. ఈ చట్టం ఇంకా రూపకల్పన దశలోనే ఉందన్నారు సజ్జల. విధివిధానాలు ఖరారు కాలేదన్నారు.

ఇక బీజేపీ నేత, ఆ పార్టీ స్టేట్ చీఫ్‌ పురందేశ్వరి సైతం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై వివరణ ఇచ్చారు. ల్యాండ్ టైట్లింగ్‌ యాక్ట్‌ను అమలు చేయాలని నీతిఆయోగ్ సిఫార్సు చేసిందన్నారు. దాన్ని అమలు చేయాలా వద్దా అనేది రాష్ట్రాల ఇష్టమని ఆమె క్లారిటీ ఇచ్చారు. పురందేశ్వరి కామెంట్స్‌ టీడీపీని మరింత గందరగోళంలో పడేశాయి. 

Tags:    
Advertisement

Similar News