అడ్డంగా దొరికిపోయిన పీవీ రమేష్

తొలుత ట్వీట్ చేసినప్పుడు నేరుగా ఈ యాక్టుకు తాను ప్రత్యక్ష బాధితుడిని అని చెప్పుకున్నారు. ఇంతలో ఎవరైనా ప్రశ్నించారేమో.. అసలు అమలులో లేని చట్టానికి మీరు ఎలా బాధితుడు అయ్యారని?!. వెంటనే ట్వీట్‌ను ఎడిట్ చేసేశారు.

Advertisement
Update: 2024-05-06 06:54 GMT

ఇంకా అమలులోకి రాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను అడ్డుపెట్టుకుని జగన్‌ను దెబ్బతీసేందుకు టీడీపీ శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. ఇందుకు మీడియా తోడైంది. ఇప్పుడు మాజీ అధికారులు కూడా కలిసి వస్తున్నారు. రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్ అదే పనిచేశారు. కానీ దొరికిపోయారు.

తొలుత పీవీ రమేష్‌ ఒక ట్వీట్ పెట్టారు ఇలా. '' నేను #AndhraPradesh #LandTitlingAct ప్రత్యక్ష బాధితుడిని.. కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టా భూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహసీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు. ఆర్డీఓ పోస్ట్ ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి ఇచ్చేశారు. నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కు లేకుండా చేస్తున్నారు. IAS అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌కు సేవలందించిన ఓ అధికారి పరిస్థితి ఇలా ఉంటే, సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేం.''




తొలుత ట్వీట్ చేసినప్పుడు నేరుగా ఈ యాక్టుకు తాను ప్రత్యక్ష బాధితుడిని అని చెప్పుకున్నారు. ఇంతలో ఎవరైనా ప్రశ్నించారేమో.. అసలు అమలులో లేని చట్టానికి మీరు ఎలా బాధితుడు అయ్యారని?!. వెంటనే ట్వీట్‌ను ఎడిట్ చేసేశారు. ఎడిట్ చేసి ట్వీట్‌లో ''చట్టం అమలులోకి రాకముందే నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కులు నిరాకరించబడుతున్నాయి.'' అంటూ లైన్ జత చేశారు.



అంటే పీవీ రమేషే చెబుతున్నారు.. ఇంకా చట్టం అమలులోకి రాలేదు. మరి అమలులో లేని చట్టానికి మరి పీవీ రమేష్ ప్రత్యక్ష బాధితుడిగా ఎలా మారారు అన్నది ప్రశ్న. ఆయన భూముల మ్యూటేషన్‌ దరఖాస్తును తహసీల్దార్ సరదాగా ఏమీ తిరస్కరించి ఉండరు. ఏదో వివాదం ఉండే ఉంటుంది. అది బయటకు వస్తే అసలు విషయం ఏమిటన్నది తేలుతుంది. పైగా కిందిస్థాయి అధికారులు సరైన వారు కాకపోయినా సామాన్యులను ఇబ్బందిపెడ‌తారేమో గానీ ఇంత సీనియర్‌ ఐఏఎస్ అధికారితో ఎందుకు పెట్టుకుంటారు?. కాబట్టి రెవెన్యూ అధికారులు దీనిపై వివరణ ఇస్తే నిజాలేంటో బయటకు వస్తాయి.

Tags:    
Advertisement

Similar News