2019 వన్డే ప్రపంచకప్ ప్రారంభం

క్వీన్ ఎలిజబెత్ తో ప్రపంచకప్ కెప్టెన్ల ఫోటో బకింగ్ హామ్ పేలస్ ఎదుట 60 సెకన్ల హంగామా నేడు ఇంగ్లండ్ తో సౌతాఫ్రికా ప్రారంభ మ్యాచ్ ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా ఐదోసారి వన్డే ప్రపంచకప్ పోటీలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. బ్రిటీష్ రాణి ఎలిజబెత్ అధికారిక నివాసం బకింగ్ హామ్ ప్యాలెస్ ఎదుట నిర్వహించిన ప్రారంభవేడుకలను క్లుప్తంగా ముగించారు. ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ బూన్ అంపైర్ గా వ్యవహరించిన 60 సెకన్ల చాలెంజ్ పోటీలలో మొత్తం 10 […]

Advertisement
Update: 2019-05-29 23:52 GMT
  • క్వీన్ ఎలిజబెత్ తో ప్రపంచకప్ కెప్టెన్ల ఫోటో
  • బకింగ్ హామ్ పేలస్ ఎదుట 60 సెకన్ల హంగామా
  • నేడు ఇంగ్లండ్ తో సౌతాఫ్రికా ప్రారంభ మ్యాచ్

ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా ఐదోసారి వన్డే ప్రపంచకప్ పోటీలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. బ్రిటీష్ రాణి ఎలిజబెత్ అధికారిక నివాసం బకింగ్ హామ్ ప్యాలెస్ ఎదుట నిర్వహించిన ప్రారంభవేడుకలను క్లుప్తంగా ముగించారు.

ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ బూన్ అంపైర్ గా వ్యవహరించిన 60 సెకన్ల చాలెంజ్ పోటీలలో మొత్తం 10 దేశాలకు చెందిన
మాజీ క్రికెటర్లు, సెలబ్రిటీల జోడీలు పాల్గొన్నారు.

ఈ చాలెంజ్ లో పాల్గొన్న క్రికెట్ మాజీ గ్రేట్లలో అనీల్ కుంబ్లే, జాక్ కలిస్, బ్రెట్ లీ, కెవిన్ పీటర్సన్, క్రిస్ లూయిస్ ఉన్నారు.
ఇంగ్లండ్ జోడీ కెవిన్ పీటర్సన్- క్రిస్ లూయిస్ 60 సెకన్ల చాలెంజ్ లో 74 పరుగులు సాధించి విజేతలుగా నిలిచారు.
భారతజోడీ అనీల్ కుంబ్లే- ఫర్హాన్ అక్తర్ కేవలం 19 పరుగులు మాత్రమే సాధించి..ఆఖరిస్థానంలో నిలిచారు.

క్వీన్ ఎలిజబెత్ తో కెప్టెన్ల ఫోటో..

ఇంగ్లండ్ గడ్డపై ఆరువారాలపాటు సాగే ఈ టోర్నీలో పాల్గొంటున్న మొత్తం 10 దేశాల జట్ల కెప్టెన్లు నోయిన్ మోర్గాన్, విరాట్ కొహ్లీ, ఫాబ్ డూప్లెసీ, సర్ ఫ్రాజ్ అహ్మద్, ముషరఫే మొర్తాజా, జేసన్ హోల్డర్, కేన్ విలియమ్స్ సన్, ఆరోన్ ఫిచ్, శ్రీలంక, అప్ఘన్ సారథులు సైతం… బకింగ్ హామ్ ప్యాలెస్ కు వెళ్లి క్వీన్ ఎలిజబెత్ ను మర్యాదపూర్వకంగా కలిసి..అధికారిక ఫోటో దిగారు.

పోటీల ప్రారంభవేడుకల సందర్భంగా వివిధ దేశాల జాతీయ పతాకాలతో బకింగ్ హామ్ ప్యాలెస్ పరిసర ప్రాంతాలను ముస్తాబు చేశారు. వివిధ దేశాల నుంచి తరలి వచ్చిన అభిమానులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రపంచకప్ చరిత్రలో ఎలాంటి హడావిడీ లేకుండా ప్రారంభవేడుకలు నిర్వహించడం ఇదే మొదటిసారి.

జులై 14న లార్డ్స్ లో టైటిల్ సమరం

మే 30 నుంచి జులై 14 వరకూ జరిగే ఈ రౌండ్ రాబిన్ లీగ్ కమ్ సెమీఫైనల్స్ నాకౌట్ టోర్నీ ప్రారంభమ్యాచ్ లో ఆతిథ్య ఇంగ్లండ్ తో సౌతాఫ్రికా ఢీ కొనబోతోంది. లండన్ లోని ఓవల్ వేదికగా ప్రారంభమ్యాచ్ జరుగుతుంది.

మే 31న జరిగే రెండో లీగ్ పోటీలో వెస్టిండీస్- పాకిస్థాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు తన ప్రారంభమ్యాచ్ ను జూన్ 5న సౌతాఫ్రికాతో ఆడనుంది.

క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా జులై 14న జరిగే టైటిల్ సమరంతో ఈ టోర్నీకి తెరపడనుంది. ప్రస్తుత ఈ పోటీలలో ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియా హాట్ ఫేవరెట్ గా టైటిల్ సమరానికి దిగుతోంది.

Tags:    
Advertisement

Similar News