రాజీనామా చేసేది లేదు.... కావాలంటే తప్పించండి " టీటీడీ చైర్మన్

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం రసాభాసగా జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నాయకుడు పుట్టా సుధాకర్ యాదవ్ ను చైర్మన్‌గా నియమించారు. ఆయనతో పాటు మరికొందరు నాయకులను కూడా తెలుగుదేశం ప్రభుత్వం టీటీడీ పాలక మండలి సభ్యులుగా నియమించింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఆ ప్రభుత్వం నియమించిన సభ్యులు తమ పదవులకు రాజీనామాలను అనివార్యంగా సమర్పించాల్సి ఉంటుంది. కానీ చైర్మన్ పుట్టా […]

Advertisement
Update: 2019-05-28 01:07 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం రసాభాసగా జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నాయకుడు పుట్టా సుధాకర్ యాదవ్ ను చైర్మన్‌గా నియమించారు. ఆయనతో పాటు మరికొందరు నాయకులను కూడా తెలుగుదేశం ప్రభుత్వం టీటీడీ పాలక మండలి సభ్యులుగా నియమించింది.

ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఆ ప్రభుత్వం నియమించిన సభ్యులు తమ పదవులకు రాజీనామాలను అనివార్యంగా సమర్పించాల్సి ఉంటుంది. కానీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ మాత్రం రాజీనామా సమర్పించలేదు. మంగళవారం ఉదయం మండలి సమావేశాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేశారు.

ఈ సమావేశాన్ని టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఈ సమావేశానికి టీటీడీ ఈవో అనిల్ కుమార్, జె ఈ ఓ శ్రీనివాస రావు హాజరు కాలేదు. వారిద్దరూ లేకుండానే టీటీడీ పాలకమండలి తన సమావేశాన్ని నిర్వహించింది.

తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా ప్రభుత్వం తమను నియమించిందని, ఆ పదవులకు తాము రాజీనామా చేసే ప్రసక్తే లేదని సమావేశం అనంతరం చైర్మన్ పుట్ట ప్రకటించారు. “ మేము రాజీనామా చేసేది లేదు కావాలంటే మమ్మల్ని మీరే తప్పించండి. అంతవరకు మేం పదవులు వదిలేది లేదు” అని చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ స్పష్టం చేశారు.

అధికారులు లేకుండా పాలక మండలి సమావేశాన్ని ఏర్పాటు చేసినా…. ఎలాంటి అంశాలపై చర్చించలేదని ఆయన చెప్పారు. టీటీడీ పాలకమండలి సభ్యులలో ఒకరైన తెలుగుదేశం పార్టీ నాయకుడు చల్లా బాబు ఈ సమావేశానికి ముందు తన పదవికి రాజీనామా చేయడం కొసమెరుపు.

Tags:    
Advertisement

Similar News