పరోక్షంగా దర్శకులకు సంకేతాలు ఇస్తున్న తెలుగు బ్యూటీ

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ‘అంతకు ముందు ఆ తరువాత’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ ఈ మధ్యనే ‘బ్రాండ్ బాబు’, ‘సుబ్రమణ్యపురం’ వంటి సినిమాలలో హీరోయిన్ గా మరియు ‘అరవింద సమేత’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించింది. గత కొంతకాలంగా ఈమె తన కెరియర్ కు బ్రేక్ ఇచ్చే పాత్ర కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అయితే ముందు నుంచి హోమ్లీ పాత్రలలోనే కనిపిస్తున్న ఈషా రెబ్బ […]

Advertisement
Update: 2019-05-04 00:28 GMT

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ‘అంతకు ముందు ఆ తరువాత’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ ఈ మధ్యనే ‘బ్రాండ్ బాబు’, ‘సుబ్రమణ్యపురం’ వంటి సినిమాలలో హీరోయిన్ గా మరియు ‘అరవింద సమేత’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించింది.

గత కొంతకాలంగా ఈమె తన కెరియర్ కు బ్రేక్ ఇచ్చే పాత్ర కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అయితే ముందు నుంచి హోమ్లీ పాత్రలలోనే కనిపిస్తున్న ఈషా రెబ్బ తాజాగా రూటు మార్చింది.

సినిమాల్లో ఆఫర్లు రావాలి అంటే బోల్డ్ గా మారాల్సిందే అనుకుందో ఏమో కానీ సెక్సీ ఫొటో షూట్లతో ఇంస్టాగ్రామ్ ను వేడెక్కిస్తోంది.

వెండితెరపై ట్రెడిషనల్ పాత్రల్లో నటించిన ఈ భామ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో దర్శనమిస్తోంది.

“అందం అంటే కళ్ళతో చూసేది మాత్రమే కాదు మనసుతో కూడా అనుభూతి చెందాల్సింది” అనే క్యాప్షన్ తో ఈ మధ్యనే మరొక హాట్ ఫొటో పోస్ట్ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈమె వైఖరి చూస్తుంటే ఇండైరెక్టుగా దర్శకులకు తాను గ్లామరస్ పాత్రలు చేయడానికి కూడా సిద్ధమని సంకేతాలు ఇస్తున్నట్లుగా ఉంది. మరి ఆ సంకేతాలను ఏ దర్శకుడైనా పసిగట్టి ఈమెకి అవకాశం ఇస్తాడో లేదో చూడాలి.

Tags:    
Advertisement

Similar News