అయ్యో.. సీత కూడా వాయిదాపడింది

మహర్షి, అర్జున్ సురవరం లాంటి సినిమాలు వాయిదాల మీద వాయిదాలు పడుతుంటే కచ్చిందా వచ్చే సినిమా సీత మాత్రమే అనుకున్నారంతా. కానీ ఇప్పుడీ సినిమా కూడా పోస్ట్ పోన్ అయింది. అవును.. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా సినిమా అనుకున్న టైమ్ కు రిలీజ్ అవ్వడం లేదు. ఏప్రిల్ 25న థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమాను వచ్చే నెలకు వాయిదా వేశారు. దీనికి బలమైన కారణం ఉంది. మజిలీ ఇంకా నడుస్తోంది. ఆ తర్వాతొచ్చిన […]

Advertisement
Update: 2019-04-21 21:10 GMT

మహర్షి, అర్జున్ సురవరం లాంటి సినిమాలు వాయిదాల మీద వాయిదాలు పడుతుంటే కచ్చిందా వచ్చే సినిమా సీత మాత్రమే అనుకున్నారంతా. కానీ ఇప్పుడీ సినిమా కూడా పోస్ట్ పోన్ అయింది. అవును.. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా సినిమా అనుకున్న టైమ్ కు రిలీజ్ అవ్వడం లేదు. ఏప్రిల్ 25న థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమాను వచ్చే నెలకు వాయిదా వేశారు. దీనికి బలమైన కారణం ఉంది.

మజిలీ ఇంకా నడుస్తోంది. ఆ తర్వాతొచ్చిన జెర్సీ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. మరో 3 వారాలు థియేటర్లలో ఉండడం గ్యారెంటీ. దీనికి తోడు వచ్చే శుక్రవారం ఎవెంజర్స్-ఎండ్ గేమ్ అనే డబ్బింగ్ హాలీవుడ్ మూవీ భారీస్థాయిలో థియేటర్లలోకి వస్తోంది. చాపకింద నీరులా కాంచన-3 కూడా బి, సి సెంటర్లలో ఆడుతోంది. ఇలాంటి టైమ్ లో సీత సినిమాను విడుదల చేయడం భావ్యం కాదని భావిస్తోంది యూనిట్. అందుకే మే నెలకు వాయిదావేశారు.

అసలే బెల్లంకొండకు సాలిడ్ హిట్ లేదు. రీసెంట్ గా వచ్చిన కవచం కూడా డిజాస్టర్ అయింది. దీనికి తోడు సీత సినిమాను భారీ రేటుకు అమ్మారు. అందుకే సేఫ్ డేట్ చూసుకొని విడుదల చేద్దామనే ఉద్దేశంతో వాయిదావేశారు. తేజ డైరక్ట్ చేసిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. సోనూ సూద్ విలన్ గా నటించాడు. మన్నారా చోప్రా సెకెండ్ హీరోయిన్ గా చేసింది

Tags:    
Advertisement

Similar News