రాయపాటికి కోడెల చెక్

గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు టికెట్ల ఆటలో చిక్కుకున్నారు. ఈసారి ఆయనకు టికెట్‌ దక్కుతుందా లేదా అన్నది అనుమానంగా మారింది. పార్టీలోని వైరి వర్గం రాయపాటికి చెక్‌ పెట్టేందుకు చురుగ్గా పావులు కదుపుతోంది. రాజ్యాంగ పదవిలో ఉన్న జిల్లా కీలక నేత కోడెల… రాయపాటిని దెబ్బతీసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. నరసరావుపేట నుంచి రాయపాటిని తప్పించి… మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ను పోటీ చేయించేందుకు సదరు కీలక నేత ప్రయత్నిస్తున్నారు. రాయపాటిని తప్పించి లగడపాటికి […]

Advertisement
Update: 2019-03-09 01:02 GMT

గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు టికెట్ల ఆటలో చిక్కుకున్నారు. ఈసారి ఆయనకు టికెట్‌ దక్కుతుందా లేదా అన్నది అనుమానంగా మారింది. పార్టీలోని వైరి వర్గం రాయపాటికి చెక్‌ పెట్టేందుకు చురుగ్గా పావులు కదుపుతోంది.

రాజ్యాంగ పదవిలో ఉన్న జిల్లా కీలక నేత కోడెల… రాయపాటిని దెబ్బతీసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. నరసరావుపేట నుంచి రాయపాటిని తప్పించి… మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ను పోటీ చేయించేందుకు సదరు కీలక నేత ప్రయత్నిస్తున్నారు. రాయపాటిని తప్పించి లగడపాటికి నరసరావుపేట టికెట్ అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

తనకు నరసరావుపేట ఎంపీ టికెట్‌తో పాటు కుమారుడు రంగారావుకు సత్తెనపల్లి టికెట్ ఇవ్వాలని చంద్రబాబును రాయపాటి కోరారు. కానీ సత్తెనపల్లి టికెట్‌ కూడా రంగారావుకు దక్కకుండా కోడెల కుటుంబం అడ్డుకుందని రాయపాటి కుటుంబం గుర్రుగా ఉంది.

రాయపాటి మాత్రం తాజాగా మరోసారి వచ్చే ఎన్నికల్లో తాను, తన కుమారుడు పోటీ చేసి తీరుతామని చెప్పారు. అవినీతి, కమిషన్లు, లంచాలు, మాఫియా వంటి పనులు తాము చేయలేదని కూడా రాయపాటి వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో రాయపాటి తిరిగి సీటు సాధిస్తారా? లేక.. మరో మోదుగుల అవుతారా అన్నది చూడాలి.

Tags:    
Advertisement

Similar News