నివేత తో గొడవకి దిగిన కళ్యాణ్ రామ్

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ సినిమా “118”. ఈ సినిమా ద్వారా సినిమాటో గ్రాఫర్ కే.వి గుహన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కళ్యాణ్ రామ్ హీరోయిన్ నివేత థామస్ తో కలిసి ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. ఈ నేపధ్యంలో హీరోయిన్ నివేత థామస్ తో గొడవ పెట్టుకున్నాడట కళ్యాణ్ రామ్. అది కూడా సినిమాకు […]

Advertisement
Update: 2019-03-01 00:37 GMT

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ సినిమా “118”. ఈ సినిమా ద్వారా సినిమాటో గ్రాఫర్ కే.వి గుహన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కళ్యాణ్ రామ్ హీరోయిన్ నివేత థామస్ తో కలిసి ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. ఈ నేపధ్యంలో హీరోయిన్ నివేత థామస్ తో గొడవ పెట్టుకున్నాడట కళ్యాణ్ రామ్. అది కూడా సినిమాకు సంబంధించి రిలీజ్ మొదటి షో గురించట. అభిమానుల మధ్య కూర్చుని హైదరాబాద్‌లో చూద్దామని నివేత థామస్ కి కళ్యాణ్‌ రామ్ చెప్పాడట.

అయితే అందుకు నివేత థామస్ అస్సలు ఒప్పుకోలేదట. అభిమానుల మధ్య తోపులాట జరుగుతుంది. ప్రాణ నష్టం జరిగే అవకాశం కూడా ఉందని…. మనం వెళ్ళకూడదు…. నువ్వు కూడా వెళ్ళకూడదు అని చెప్పిందట ఈ మలయాళ భామ.

ఇక ఈ క్యూట్ తగాదాలో కళ్యాణ్ రామ్ ఎంత ఒప్పించాలని ట్రై చేసినా కూడా నివేత ప్రేక్షకుల మధ్యలో సినిమా చూడటానికి రాను అని చెప్పిందట.

Tags:    
Advertisement

Similar News