డేవిస్ కప్ లో ఇక దాయాదుల సమరం

సెప్టెంబర్లో ఇండోపాక్ జట్ల డేవిస్ కప్ ఫైట్ పాక్ ప్రత్యర్థిగా ఓటమి ఎరుగని భారత్ భారత ప్రభుత్వం అనుమతిస్తేనే డేవిస్ కప్ సమరం ప్రపంచ టెన్నిస్ పురుషుల టీమ్ విజేతలకు ఇచ్చే డేవిస్ కప్… ఆసియా-ఓషియానా జోన్ తొలిరౌండ్లో దాయాదుల సమరానికి మరోసారి రంగం సిద్ధమయ్యింది. 2006లో చివరిసారిగా తలపడిన భారత్, పాక్ జట్లు… 13 ఏళ్ల విరామం తర్వాత మరోసారి ఢీ అంటే ఢీ అంటున్నాయి. అయితే…పాకిస్థాన్ ఆతిథ్యంలో జరిగే ఈ పోటీలో భారతజట్టు పాల్గొనటానికి కేంద్ర […]

Advertisement
Update: 2019-02-12 09:03 GMT
  • సెప్టెంబర్లో ఇండోపాక్ జట్ల డేవిస్ కప్ ఫైట్
  • పాక్ ప్రత్యర్థిగా ఓటమి ఎరుగని భారత్
  • భారత ప్రభుత్వం అనుమతిస్తేనే డేవిస్ కప్ సమరం

ప్రపంచ టెన్నిస్ పురుషుల టీమ్ విజేతలకు ఇచ్చే డేవిస్ కప్… ఆసియా-ఓషియానా జోన్ తొలిరౌండ్లో దాయాదుల సమరానికి మరోసారి రంగం సిద్ధమయ్యింది. 2006లో చివరిసారిగా తలపడిన భారత్, పాక్ జట్లు… 13 ఏళ్ల విరామం తర్వాత మరోసారి ఢీ అంటే ఢీ అంటున్నాయి.

అయితే…పాకిస్థాన్ ఆతిథ్యంలో జరిగే ఈ పోటీలో భారతజట్టు పాల్గొనటానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుందా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

డేవిస్ కప్ టోర్నీలో మాజీ రన్నరప్ భారత్ పరిస్థితి వైకుంఠపాళీలో నిచ్చెనలా మారింది. ప్రపంచ గ్రూప్ పోటీలలో చోటు నిలుపుకోలేకపోయిన భారత్…ఇటలీ జట్టు చేతిలో ఓటమితో మరోసారి… ఆసియా-ఓషియానా జోన్ స్థాయికి పడిపోయింది.

ప్రపంచ గ్రూపులో చోటు దక్కించుకోవాలంటే భారత్ మరోసారి…జోనల్ రౌండ్ నుంచి పోటీకి దిగాల్సి ఉంది.

భారత్ ప్రత్యర్థి పాకిస్థాన్….

2019 డేవిస్ కప్ ఆసియా-ఓషియానా జోనల్ గ్రూప్ డ్రాను…అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ప్రకటించింది. డ్రా ప్రకారం తొలిరౌండ్లో పాక్ గడ్డపై పాకిస్థాన్ తో భారత్ తలపడాల్సి ఉంది.

1964లో చివరిసారిగా పాక్ గడ్డపై డేవిస్ కప్ మ్యాచ్ ల్లో పాల్గొన్న భారత్… 2006లో ముంబై వేదికగా ముగిసిన పోరులో 3-2తో పాకిస్థాన్ ను అధిగమించింది.

డేవిస్ కప్ చరిత్రలో ఇప్పటి వరకూ పాకిస్థాన్ తో ఆరుసార్లు తలపడిన భారత్… ఆరుకు ఆరుసార్లు విజేతగా నిలిచింది.

మహేశ్ భూపతి నాన్ ప్లేయింగ్ కెప్టెన్ గా ఉన్న భారతజట్టులో రామ్ కుమార్, ప్రజ్ఞేశ్, రోహన్ బొపన్న లాంటి ఆటగాళ్లున్నారు. అదే పాక్ జట్టులో మాత్రం ప్రపంచ డబుల్స్ 67వ ర్యాంక్ ప్లేయర్ ఖురేషీ, ముజాముమిల్ మొర్తాజా, హీరా ఆష్కీ, షాజాద్ ఖాన్ సభ్యులుగా ఉన్నారు.

ప్రపంచ టాప్ -100 సింగిల్స్ జాబితాలో చోటు సంపాదించిన ప్రజ్ఞేశ్, రామ్ కుమార్, డబుల్స్ లో మేటి రోహన్ బొపన్న లాంటి ఆటగాళ్లు భారతజట్టులోనే ఉండడంతో…పాక్ పై అలవోక విజయం ఖాయమని.. టెన్నిస్ పండితులు ధీమాగా చెబుతున్నారు.

పాక్ తో పోరు జరిగేనా?

కార్గిల్ యుద్ధం తర్వాత పాక్ తో క్రీడాసంబంధాలను తెగతెంచుకొన్న భారత ప్రభుత్వం…పాక్ పర్యటన కోసం భారత డేవిస్ కప్ జట్టును అనుమతిస్తుందా? అన్నది బిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ఒకవేళ తటస్థ వేదికగా వేరే దేశంలో పోరు జరిగితేనే పాక్ తో భారత జట్టు ఢీ కొనే అవకాశాలు ఉన్నాయి.

గత ఏడాది కొరియా, ఉజ్ బెకిస్థాన్ జట్లతో జరిగిన డేవిస్ కప్ మ్యాచ్ లకు ఇస్లామాబాద్ వేదికగా పాకిస్థాన్ ఆతిథ్యమిచ్చింది. భారత్ తో జరిగే పోటీకి సైతం ఇస్లామాబాద్ నే వేదికగా ఎంపిక చేశారు. ఒకవేళ భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే…. భారతజట్టు మ్యాచ్ ను చేజార్చుకోక తప్పదు.

1971లో సౌతాఫ్రికాతో డేవిస్ కప్ ఫైనల్స్ ఆడాల్సిన భారతజట్టుకు …ప్రభుత్వ అనుమతి లేకపోడంతో మ్యాచ్ ను బాయ్ కాట్ చేసి…. ట్రోఫీని అందుకొనే అవకాశం చేజార్చుకొంది.

 

సెప్టెంబర్లో పాకిస్థాన్ తో జరిగే మ్యాచ్ కు సైతం భారత్ దూరంగా ఉండాలని భావిస్తే…. అదే ఫలితం పునరావృతమయ్యే ప్రమాదం లేకపోలేదు.

Tags:    
Advertisement

Similar News