హుషారుగా విజయ్ దేవరకొండ

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ హీరోకి ఇప్పుడు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. అందులో స్టార్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. ఇక ఇటీవలే విజయ్ దేవరకొండ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ “నేను కొత్త డైరెక్టర్స్ కి అవకాశం ఇవ్వడం కాదు, వాళ్ళు నా దగ్గరకి వచ్చి కథ చెప్పడం నా అదృష్టం” అని చెప్పాడు. అలా చెప్పి రెండు రోజులు అయ్యిందో లేదో ఇప్పుడు ఒక చిన్న దర్శకుడికి అవకాశం […]

Advertisement
Update: 2019-02-05 07:40 GMT

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ హీరోకి ఇప్పుడు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. అందులో స్టార్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు.

ఇక ఇటీవలే విజయ్ దేవరకొండ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ “నేను కొత్త డైరెక్టర్స్ కి అవకాశం ఇవ్వడం కాదు, వాళ్ళు నా దగ్గరకి వచ్చి కథ చెప్పడం నా అదృష్టం” అని చెప్పాడు. అలా చెప్పి రెండు రోజులు అయ్యిందో లేదో ఇప్పుడు ఒక చిన్న దర్శకుడికి అవకాశం ఇచ్చేసాడు విజయ్ దేవరకొండ.

రీసెంట్ గా “హుషారు” సినిమాతో డెబ్యూ ఇచ్చిన హర్ష తొలి సినిమాతోనే సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇటీవలే ఈ సినిమా గ్రాండ్ గా 50 డేస్ కూడా పూర్తి చేసుకుంది.

శ్రీ హర్ష టాలెంట్ ని పసిగట్టిన విజయ్ దేవరకొండ హర్ష ని ఒక కథ రెడీ చేసుకొని రమ్మని, నా నెక్స్ట్ సినిమా నీతోనే అని చెప్పాడట. శ్రీ హర్ష ఈ విషయాన్ని ఇటీవలే ఒక ప్రెస్ మీట్ లో కూడా చెప్పాడు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెలువడనున్నాయి.

Tags:    
Advertisement

Similar News