దిల్ రాజుకు మళ్లీ దెబ్బపడింది

నేరుగా సినిమాలు తీసిన ప్రతిసారి కాస్తోకూస్తో లాభాలు చూశాడు దిల్ రాజు. చివరికి ఫ్లాప్ అయిన శ్రీనివాస కల్యాణం కూడా రాజుకు డిజిటల్, శాటిలైట్ రూపంలో కాస్త కలిసొచ్చిందనే చెప్పాలి. కానీ డబ్బింగ్ సినిమాల డిస్ట్రిబ్యూషన్ విషయంలో మాత్రం దిల్ రాజు పూర్తిగా ఫెయిల్. ఈ విషయాన్ని 2.0 మరోసారి స్పష్టంచేసింది. ఈ సినిమా తెలుగు రైట్స్ ను ఏకంగా 74 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. యూవీ క్రియేషన్స్ వంశీ, ఎన్వీ ప్రసాద్ తో కలిసి […]

Advertisement
Update: 2018-12-04 23:58 GMT

నేరుగా సినిమాలు తీసిన ప్రతిసారి కాస్తోకూస్తో లాభాలు చూశాడు దిల్ రాజు. చివరికి ఫ్లాప్ అయిన శ్రీనివాస కల్యాణం కూడా రాజుకు డిజిటల్, శాటిలైట్ రూపంలో కాస్త కలిసొచ్చిందనే చెప్పాలి. కానీ డబ్బింగ్ సినిమాల డిస్ట్రిబ్యూషన్ విషయంలో మాత్రం దిల్ రాజు పూర్తిగా ఫెయిల్. ఈ విషయాన్ని 2.0 మరోసారి స్పష్టంచేసింది.

ఈ సినిమా తెలుగు రైట్స్ ను ఏకంగా 74 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. యూవీ క్రియేషన్స్ వంశీ, ఎన్వీ ప్రసాద్ తో కలిసి దిల్ రాజు ఈ రైట్స్ దక్కించుకున్నారు. కానీ ఏపీ, నైజాంలో 2.0 వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. మరీ ముఖ్యంగా నిన్నట్నుంచి ఈ సినిమాకు వసూళ్లు దారుణంగా పడిపోయాయి. దీంతో దిల్ రాజుకు నష్టాలు తప్పేలా లేవు.

ఇక్కడ దిల్ రాజు బుక్ అయిపోయిన మరో అంశం ఉంది. నైజాంలో దిల్ రాజు స్ట్రాంగ్. కానీ నైజాంను ఎన్వీ ప్రసాద్ కు అప్పగించి, తను ఆంధ్రాలో దిగాడు. ఈ నిర్ణయం కూడా రాజుకు కలిసిరాలేదు. 2.0 వసూళ్లు కాస్తోకూస్తో నైజాంలోనే బాగున్నాయి. ఆంధ్రాలో మరీ దారణంగా ఉన్నాయి. ఈ ఏడాది డిస్ట్రిబ్యూషన్ పరంగా దిల్ రాజు పూర్తిగా ఫెయిలయ్యాడు. 2.0తో అది పరిసమాప్తమైంది.

Tags:    
Advertisement

Similar News