ఎన్టీఆర్" బయోపిక్ లో కృష్ణ కుమారి కూడా వచ్చి చేరింది

నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటి స్తూ ఆయన జీవితాన్ని తెరపై పెడుతున్న సినిమా “ఎన్టీఆర్” బయోపిక్.  క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ శ్రీ దేవిగా అలాగే నిత్య మీనన్ సావిత్రి గా నటిస్తుండగా ఇప్పుడు మరో హీరోయిన్ ఈ సినిమాలో వచ్చి జాయిన్ అయ్యింది. అలనాటి హీరోయిన్ అయిన కృష్ణ కుమారి రోల్ లో మలయాళ బ్యూటీ […]

Advertisement
Update: 2018-11-14 21:40 GMT

నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటి స్తూ ఆయన జీవితాన్ని తెరపై పెడుతున్న సినిమా “ఎన్టీఆర్” బయోపిక్. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ శ్రీ దేవిగా అలాగే నిత్య మీనన్ సావిత్రి గా నటిస్తుండగా ఇప్పుడు మరో హీరోయిన్ ఈ సినిమాలో వచ్చి జాయిన్ అయ్యింది.

అలనాటి హీరోయిన్ అయిన కృష్ణ కుమారి రోల్ లో మలయాళ బ్యూటీ మాళవిక నాయర్ నటించనుంది. సీనియర్ ఎన్టీఆర్ కి, కృష్ణ కుమారి కి అప్పట్లో మంచి బాండింగ్ ఉండేది. ఇప్పుడు ఈ బయోపిక్ ద్వారా అది మళ్ళి ప్రేక్షకుల గుర్తు చేద్దాం అని చెప్పి బాలకృష్ణ ప్రయత్నిస్తున్నాడు. అతి త్వరలో బాలకృష్ణ, మాళవిక మీద సీన్స్ షూట్ చేస్తారట. బాలకృష్ణ కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాని వారాహి చాలని చిత్రం పై సాయి కొర్రపాటి ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఎం.ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News