యాత్ర టాకీ పార్ట్ పూర్తి

నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటున్న యాత్ర సినిమా ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ దాదాపు పూర్తయినట్టు ప్రకటించాడు దర్శకుడు మహి వి రాఘవ్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర కాన్సెప్ట్ తో యాత్ర సినిమా తెరకెక్కుతోంది. ఇందులో వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నాడు. అతడికి సంబంధించిన టోటల్ షూటింగ్ కంప్లీట్ అయిందని ప్రకటించాడు దర్శకుడు. కేవలం షూటింగ్ మాత్రమే కాకుండా, మమ్ముట్టి పోర్షన్ కు సంబంధించిన డబ్బింగ్ కూడా […]

Advertisement
Update: 2018-10-31 22:32 GMT

నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటున్న యాత్ర సినిమా ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ దాదాపు పూర్తయినట్టు ప్రకటించాడు దర్శకుడు మహి వి రాఘవ్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర కాన్సెప్ట్ తో యాత్ర సినిమా తెరకెక్కుతోంది. ఇందులో వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నాడు. అతడికి సంబంధించిన టోటల్ షూటింగ్ కంప్లీట్ అయిందని ప్రకటించాడు దర్శకుడు. కేవలం షూటింగ్ మాత్రమే కాకుండా, మమ్ముట్టి పోర్షన్ కు సంబంధించిన డబ్బింగ్ కూడా పూర్తయినట్టు తెలిపాడు.

వైఎస్ జగన్ ప్రస్తావన లేకుండానే వస్తోంది యాత్ర సినిమా. ఈ మూవీలో జగన్ పాత్ర కోసం సూర్య లాంటి ప్రముఖుల పేర్లు అనుకున్నారు. కానీ స్టార్స్ కాల్షీట్లు అందుబాటులో లేకపోవడం, మరోవైపు రిలీజ్ డేట్ దగ్గర పడడంతో స్క్రీన్ ప్లేలో మార్పులు చేశారు. జగన్ పాత్ర లేకుండానే యాత్ర సినిమా ముగిస్తున్నారు.

జగన్ పుట్టినరోజు డిసెంబర్ 21న యాత్ర సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరో 10 రోజుల్లో సినిమాకు సంబంధించి టోటల్ షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని, ఆ తర్వాత ప్రచారాన్ని ప్రారంభిస్తామని యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

Tags:    
Advertisement

Similar News