జనతా గ్యారేజ్‌లో ఎన్టీఆర్‌కు డ్యామేజ్‌ జరిగిందా?

 చిత్రపరిశ్రమలో తెలుగుదనాన్ని కోరుకునే సీనియర్ నటుడు కోటా శ్రీనివాస్‌రావు మరోసారి ఈ విషయంలో ఓపెన్ అయ్యారు. తెలుగు చిత్రపరిశ్రమలో తెలుగుదనం నశించిపోతున్న విధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ జనతా గ్యారేజ్ చిత్రాన్ని ప్రస్తావించారు కోటా. మళయాళ నటుడు మోహన్‌లాల్‌ సినిమాలో నటించడం వల్ల పక్కనున్న తెలుగు వాడికి ఇబ్బంది వచ్చిందన్నారు. ‘మొన్నీమధ్యన ఓ సినిమా విడుదలైంది. ఆ సినిమాలో హీరో గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదు. క్యారెక్టర్‌ రోల్‌ వేసిన మోహన్‌లాల్‌ గురించే మాట్లాడుతున్నారు. మోహన్‌లాల్ నటన […]

Advertisement
Update: 2016-09-16 11:42 GMT

చిత్రపరిశ్రమలో తెలుగుదనాన్ని కోరుకునే సీనియర్ నటుడు కోటా శ్రీనివాస్‌రావు మరోసారి ఈ విషయంలో ఓపెన్ అయ్యారు. తెలుగు చిత్రపరిశ్రమలో తెలుగుదనం నశించిపోతున్న విధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ జనతా గ్యారేజ్ చిత్రాన్ని ప్రస్తావించారు కోటా. మళయాళ నటుడు మోహన్‌లాల్‌ సినిమాలో నటించడం వల్ల పక్కనున్న తెలుగు వాడికి ఇబ్బంది వచ్చిందన్నారు. ‘మొన్నీమధ్యన ఓ సినిమా విడుదలైంది. ఆ సినిమాలో హీరో గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదు. క్యారెక్టర్‌ రోల్‌ వేసిన మోహన్‌లాల్‌ గురించే మాట్లాడుతున్నారు. మోహన్‌లాల్ నటన అద్భుతమండి అంటున్నారు. మోహన్‌లాల్‌ గొప్ప నటుడన్న విషయంలో సందేహం లేదు.

అలాంటి వాడిని పెట్టుకుని సినిమా తీసి.. బాగా చేశాడంటే ఎలా? పక్కనున్న తెలుగు వాడు ఏమైపోయాడు? మోహన్‌లాల్‌ పక్కన చేసిన తెలుగు నటుడు జనాల కళ్లకు ఆనాలంటే ఎంత యాక్ట్‌ చేయాలి. అలాంటి వారిని పెట్టుకుంటే పనైపోతుందిలే అనుకుంటే.. తెలుగు వారు భోజనం చేయనక్కర్లేదా?.’ అని ప్రశ్నించారు. పరోక్షంగా మోహన్‌లాల్‌ వల్ల జూనియర్‌ ఎన్టీఆర్‌ క్యారెక్టర్ చిన్నబోయిందన్న అభిప్రాయాన్ని కోటా శ్రీనివాసరావు వ్యక్తపరిచినట్టు అయింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News