అసెంబ్లీలో తోపులాట...కిందపడిపోయిన చెవిరెడ్డి

అసెంబ్లీని రెండో రోజూ ప్రత్యేక హోదా అంశం కుదిపేసింది. వెంటనే హోదాపై చర్చ చేపట్టాలంటూ వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. అయితే ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాతే చర్చ ఉంటుందని యనమల స్పష్టం చేశారు. లోటస్ పాండ్ రూల్స్ ఇక్కడ వర్తించవని ఆగ్రహంవ్యక్తం చేశారు. దీంతో వైసీపీ సభ్యులు ఆందోళన మరింత తీవ్రతరం చేశారు. హోదా ఆంధ్రుల హక్కు అని నినదించారు.  స్పీకర్‌ చైర్‌ను చుట్టుముట్టారు. ఈసమయంలో మార్షల్స్‌ వైసీపీ ఎమ్మెల్యేలను వెనక్కు నెట్టివేశారు. దీంతో […]

Advertisement
Update: 2016-09-08 22:23 GMT

అసెంబ్లీని రెండో రోజూ ప్రత్యేక హోదా అంశం కుదిపేసింది. వెంటనే హోదాపై చర్చ చేపట్టాలంటూ వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. అయితే ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాతే చర్చ ఉంటుందని యనమల స్పష్టం చేశారు. లోటస్ పాండ్ రూల్స్ ఇక్కడ వర్తించవని ఆగ్రహంవ్యక్తం చేశారు. దీంతో వైసీపీ సభ్యులు ఆందోళన మరింత తీవ్రతరం చేశారు. హోదా ఆంధ్రుల హక్కు అని నినదించారు. స్పీకర్‌ చైర్‌ను చుట్టుముట్టారు. ఈసమయంలో మార్షల్స్‌ వైసీపీ ఎమ్మెల్యేలను వెనక్కు నెట్టివేశారు. దీంతో చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి కిందపడిపోయారు. తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. దీంతో సభను స్పీకర్ పది నిమిషాల పాటు వాయిదా వేశారు. అనంతరం బయట మీడియాతో మాట్లాడిన చెవిరెడ్డి … హోదా కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తామన్నారు. సభలో నిరసన తెలపడం సహజమని.. అలా చేసినందుకు మార్షల్స్‌తో కొట్టించడం ఏమిటని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసు కోసం తెలుగు ప్రజల జీవితాలను నాశనం చేయవద్దని చంద్రబాబును కోరారు. అసెంబ్లీలో తమ హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు.

Click on Image to Read:

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Tags:    
Advertisement

Similar News