చంద్రబాబు సంపద సృష్టి.. ఒక్కో ఎలుకకు రూ.20 వేలు

ఒక్కో ఎలుకను పట్టుకోవడానికి కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి రూ.20 వేల చొప్పున ఖర్చు చేసింది. ఈ లెక్కన మొత్తం 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు.

Advertisement
Update: 2024-05-10 06:22 GMT

సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారంటే సంపద సృష్టిస్తానని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఆయన సంపద సృష్టి ఏమో గానీ ప్రభుత్వ ధనాన్ని కాంట్రాక్టర్లకు పంచిపెట్టడంలో దిట్ట అని మాత్రం తెలిసిపోతూ ఉంది. ఆయన ప్రభుత్వ హయాంలో జరిగిన ఓ సంఘటనను గుర్తుకు తెచ్చుకుంటే మనకు ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో ఒక్కో ఎలుకను పట్టుకోవడానికి రూ.20 వేలు ఆయన ప్రభుత్వం ఖర్చు చేసిందంటే నమ్మశక్యం కావడం లేదు కదూ.. కానీ అది పచ్చి నిజం. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుకలను పట్టుకోవడానికి రూ. 60 లక్షలు ఖర్చు చేశారు. మొత్తం 300 ఎలుకలను పట్టుకోవడానికి అక్షరాలా 60 లక్షల రూపాయలు ఖర్చు చేశారు.

కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుకల వల్ల రోగులు ఇబ్బంది పడుతున్నారని గుర్తించి, వాటిని పట్టుకోవడానికి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఒక్కో ఎలుకను పట్టుకోవడానికి కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి రూ.20 వేల చొప్పున ఖర్చు చేసింది. ఈ లెక్కన మొత్తం 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు.

ఎలుకలను పట్టుకోవడానికి అంత ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుందా అంటే చంద్రబాబు ప్రభుత్వానికి అవసరమేనని అనిపించింది. కొంత మంది గ్రామాలకు వచ్చి ఎలుకలను పట్టుకుంటామని తిరుగుతుంటారు. వారికి భోజనం పెట్టి కొంత నగదు ఇస్తే సరిపోతుంది. కానీ, కర్నూలు ఆస్పత్రి అధికారులు మాత్రం కొండను తవ్వి ఎలుకలను పట్టాలని అనుకున్నారో ఏమో ఒక్కో ఎలుకకు రూ.20 వేల చొప్పున ఖర్చు చేశారు.

Tags:    
Advertisement

Similar News