అమీర్‌పేట్‌లో ఇంటర్వ్యూకి వెళ్లిన యువతిపై అత్యాచారయత్నం

హైదరాబాద్‌ అమీర్‌పేట్‌లో దారుణం జరిగింది. ఇంటర్వ్యూకి వచ్చిన ఓ యువతిపై అత్యాచారయత్నం చేయడం సంచలనంగా మారింది.

Advertisement
Update: 2024-05-10 07:28 GMT

ఎన్ని కఠినమైన చట్టాలొచ్చినా ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. హైదరాబాద్‌ అమీర్‌పేట్‌లో దారుణం జరిగింది. ఇంటర్వ్యూకి వచ్చిన ఓ యువతిపై అత్యాచారయత్నం చేయడం సంచలనంగా మారింది.

జాబ్‌ కోసమని ఓ యువతి అమీర్‌పేట్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ ఆఫీసుకు ఇంటర్వ్యూకి వెళ్లింది. ఆమెను ఇంటర్వ్యూ చేసిన సంస్థ మేనేజర్ నవీన్‌కుమార్ జాబ్‌కు సెలక్ట్ అయినట్లు చెప్పాడు. కంపెనీ సిమ్‌ కార్డు ఇవ్వాలనే సాకుతో యువతిని ఇంటికి పిలిపించుకున్నాడు. దీంతో ఆమె అతడి ఇంటికి వెళ్లగా.. అత్యాచారం చేసేందుకు యత్నించాడు.

అదృష్టవశాత్తు ఆ కీచకుడి చెర నుంచి యువతి తప్పించుకుంది. బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న మధురానగర్ పోలీసులు నవీన్‌కుమార్‌ను అరెస్టు చేశారు. నిందితుడిపై 376 R/w 511 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు.

Tags:    
Advertisement

Similar News