మాజీ గవర్నర్‌గా తొలి ఇంటర్వ్యూలో రోశయ్య ఏం చెప్పారంటే...

తమిళనాడు గవర్నర్‌గా పదవికాలం పూర్తి చేసుకున్న రోశయ్య తొలిసారిగా ప్రముఖ తెలుగుటీవీ ఛానల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 84ఏళ్ల కాలంలో సుధీర్ఘ రాజకీయ అనుభవాన్ని సంపాదించుకున్న రోశయ్య… ఇకపై ఏ పదవి చేపట్టబోనని చెప్పారు. అందుకు తన వయసు సహకరించదన్నారు. కాకపోతే ఎవరైనా వస్తే సలహాలు సూచనలు ఇస్తానన్నారు. తమిళనాడు రాజకీయాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల పార్టీల్లో క్రమ శిక్షణ తక్కువగా ఉందన్నారు. తమిళనాడులో పార్టీ నాయకుడు ఒకటి చెబితే మిగిలిన వారంతా దాన్ని శిరోధార్యంగా భావిస్తారని […]

Advertisement
Update: 2016-09-05 10:45 GMT

తమిళనాడు గవర్నర్‌గా పదవికాలం పూర్తి చేసుకున్న రోశయ్య తొలిసారిగా ప్రముఖ తెలుగుటీవీ ఛానల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 84ఏళ్ల కాలంలో సుధీర్ఘ రాజకీయ అనుభవాన్ని సంపాదించుకున్న రోశయ్య… ఇకపై ఏ పదవి చేపట్టబోనని చెప్పారు. అందుకు తన వయసు సహకరించదన్నారు. కాకపోతే ఎవరైనా వస్తే సలహాలు సూచనలు ఇస్తానన్నారు. తమిళనాడు రాజకీయాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల పార్టీల్లో క్రమ శిక్షణ తక్కువగా ఉందన్నారు. తమిళనాడులో పార్టీ నాయకుడు ఒకటి చెబితే మిగిలిన వారంతా దాన్ని శిరోధార్యంగా భావిస్తారని తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు. ఇక్కడ కొంచెం స్వేచ్చ ఎక్కువగా ఉందన్నారు. తన రాజకీయ జీవితంలో సీఎంగా తెలంగాణ ఉద్యమాన్ని హ్యాండిల్ చేయడమే టఫ్‌గా అనిపించిందన్నారు.

తాను సీఎం పదవి ఊహించినది కాదన్నారు. హఠాత్తుగా ఆ పదవి చేపట్టాల్సి వచ్చిందన్నారు. ఆ సమయంలో జగన్‌ ప్యాక్టర్ కూడా పనిచేసిందన్నారు. విభజన తర్వాత కాంగ్రెస్ బాగా దెబ్బతిన్నప్పటికీ అంతటితోనే ఆ పార్టీ పని అయిపోయిందని భావించలేమన్నారు. మునుముందు పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలన్నారు. ప్రస్తుత పార్టీల రాజకీయాలపై లోతుగా విశ్లేషణను తాను చేయనన్నారు. మోదీ ప్రధాని అయ్యాక కాంగ్రెస్‌ హయంలో నియమించిన గవర్నర్లను తొలగించడాన్ని చూసి తాను కూడా మానసికంగా సిద్ధపడ్డానని చెప్పారు. కానీ ఆ పరిస్థితి రాలేదన్నారు. అందుకు కారణం తాను పరిధి దాటకుండా పనిచేసుకుపోవడమే అయి ఉండవచ్చన్నారు. మరోసారి గవర్నర్‌ పదవి రెన్యువల్ కావాలని తాను ప్రయత్నించలేదన్నారు. రూలింగ్ పార్టీకి చెందిన వారు అనేక మంది నాయకులు ఉంటారని… వారికి కూడా ఆశలు ఉంటాయన్నారు. కాబట్టి వారికి కూడా అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర నాయకత్వంపై ఉంటుందన్నారు. తన జీవితంపై పుస్తకాన్ని రచించేందుకు ఇద్దరు ప్రయత్నిస్తున్నారని రోశయ్య చెప్పారు. దేశం కోసం ఎంతో మంది మహానుభావులు పనిచేశారని, కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారని వారితో పోలిస్తే తాను ఎంతటివాడినన్నారు.తాను చేసిన త్యాగాలు కూడా పెద్దగా లేవన్నారు. కాబట్టి తన జీవితమేమీ పెద్ద విశేషం కాదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నా మెల్లగా సర్దుకుంటాయన్నారు. ఏదో ఒక రోజు ఆంధ్రప్రదేశ్ గాడిన పడుతుందన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News