ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో తెలియదా?- బాబు ఆగ్రహం

అత్త మీద కోపం దుత్తమీద చూపినట్టుగా తయారైంది చంద్రబాబు పరిస్థితి. ఓటుకు నోటు కేసులో ఇరుకున్న సమయంలోనూ అప్పటి ఇంటెలిజెన్స్ అధికారులపై విరుచుకుపడ్డ చంద్రబాబు… మరోసారి అదే పనిచేశారు. అప్పట్లో ఏకంగా ఇంటెలిజెన్స్ హెడ్ అనురాధను బదిలీ చేసి… తనకు ఇష్టమైన వెంకటేశ్వరరావును ఆ స్థానంలో నియమించారు. కానీ తాను ఆశించిన నిఘా ఉండడం లేదని చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. 14 నెలల పాటు ఓటుకు నోటు కేసును సమర్థవంతంగా పక్కనపడేలా చేయగలిగిన చంద్రబాబుకు తాజాగా ఏసీబీ […]

Advertisement
Update: 2016-08-31 22:14 GMT

అత్త మీద కోపం దుత్తమీద చూపినట్టుగా తయారైంది చంద్రబాబు పరిస్థితి. ఓటుకు నోటు కేసులో ఇరుకున్న సమయంలోనూ అప్పటి ఇంటెలిజెన్స్ అధికారులపై విరుచుకుపడ్డ చంద్రబాబు… మరోసారి అదే పనిచేశారు. అప్పట్లో ఏకంగా ఇంటెలిజెన్స్ హెడ్ అనురాధను బదిలీ చేసి… తనకు ఇష్టమైన వెంకటేశ్వరరావును ఆ స్థానంలో నియమించారు. కానీ తాను ఆశించిన నిఘా ఉండడం లేదని చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. 14 నెలల పాటు ఓటుకు నోటు కేసును సమర్థవంతంగా పక్కనపడేలా చేయగలిగిన చంద్రబాబుకు తాజాగా ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలు షాక్ ఇచ్చాయి. సెప్టెంబర్ 29లోపు కేసులో బాబు పాత్ర తేల్చాలని ఏసీబీ కోర్టు ఆదేశించడంతో… చంద్రబాబు వరుసగా న్యాయనిపుణులు, ఉన్నతాధికారులతో సమావేశమవుతున్నారు.

ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి ఇంటెలిజెన్స్ చీఫ్‌, ఉన్నతాధికారులను పిలిపించుకుని ఆగ్రహం వ్యక్తం చేశారని కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. మీవల్ల నేను ఇబ్బందులు పడాల్సి వస్తోందంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారని చెబుతున్నారు. ఎమ్మెల్యేల మీద నిఘా పెట్టడం కూడా చేతకాదా అని ప్రశ్నించారట. ప్రతిపక్ష పార్టీ నుంచి 20 మందిని టీడీపీలోకి తీసుకొచ్చాం… ఆ మిగిలిన పత్రిపక్ష ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో కనిపెట్టలేనప్పుడు ఇక నిఘా వ్యవస్థ ఎందుకుని చంద్రబాబు ప్రశ్నించారని చెబుతున్నారు. రాజధాని ప్రాంతానికే చెందిన ఒక ఎమ్మెల్యే కోర్టుకు వెళ్లి ఆదేశాలు తెచ్చేంత వరకు పరిస్థితి వెళ్లినా ముందే ఎందుకు గుర్తించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారని అధికారవర్గాలు చెబుతున్నాయి.

అప్పట్లో తన ఫోన్లను పక్క రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తున్నా మీ ఇంటెలిజెన్స్ గుర్తించలేకపోయింది… దాని వల్ల పరిస్థితి ఇంతదూరం వచ్చిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. అయినా వైసీపీ ఎమ్మెల్యే కోర్టుకు వెళ్లిన విషయాన్ని నిఘా వర్గాలు ముందే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ఉంటే ఏం చేసేవారో!. ఇంటెలిజెన్స్ ఉన్నది చంద్రబాబు వ్యక్తిగత అవసరాల కోసమా?.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News