నటీమణుల నగ్నచిత్రాలతో బ్లాక్‌ మెయిలా? " చిత్ర పరిశ్రమ ఇంతగా దిగజారిందా?

తెలుగు చిత్ర పరిశ్రమ పరువు రోడ్డున పడింది. సినిమాలో చీకటి కోణాలను స్వయంగా పరిశ్రమ పెద్దలే పోటీ పడి బయటపెట్టుకుంటున్నారు. గ్యాంగ్‌ స్టర్‌ నయీంతో నిర్మాతలు సి. కల్యాణ్, బండ్ల గణేష్, అశోక్‌ కుమార్, బూరుగుపల్లి శివరామకృష్ణ తదితరులకు లింకులున్నాయని ఆరోపించిన నిర్మాత నట్టికుమార్… నయీంకు చిత్ర పరిశ్రమతో పరిచయాలు పెట్టుకోవడానికి కారణాలు వేరున్నాయని రెండు రోజుల క్రితం వివరించారు. నయీంకు సినీపరిశ్రమ నుంచి అమ్మాయిలను కొందరు సరఫరా చేసేవారని వెల్లడించారు. అందుకే నయీం సినిమావాళ్లతో పరిచయాలు […]

Advertisement
Update: 2016-08-25 23:30 GMT

తెలుగు చిత్ర పరిశ్రమ పరువు రోడ్డున పడింది. సినిమాలో చీకటి కోణాలను స్వయంగా పరిశ్రమ పెద్దలే పోటీ పడి బయటపెట్టుకుంటున్నారు. గ్యాంగ్‌ స్టర్‌ నయీంతో నిర్మాతలు సి. కల్యాణ్, బండ్ల గణేష్, అశోక్‌ కుమార్, బూరుగుపల్లి శివరామకృష్ణ తదితరులకు లింకులున్నాయని ఆరోపించిన నిర్మాత నట్టికుమార్… నయీంకు చిత్ర పరిశ్రమతో పరిచయాలు పెట్టుకోవడానికి కారణాలు వేరున్నాయని రెండు రోజుల క్రితం వివరించారు. నయీంకు సినీపరిశ్రమ నుంచి అమ్మాయిలను కొందరు సరఫరా చేసేవారని వెల్లడించారు. అందుకే నయీం సినిమావాళ్లతో పరిచయాలు పెట్టుకున్నారని ఆరోపించారు. ఇందుకు సీ. కల్యాణ్ శుక్రవారం ఉదయం కౌంటర్ ఇచ్చారు. నట్టికుమార్‌పై ప్రతిఆరోపణలు చేశారు. నట్టికుమార్ జీవితమంతా బ్లాక్‌ మెయిల్, నీలిచిత్రాలమయమని ఆరోపించారు.

సినిమాల్లో నటించే అమ్మాయిలను కూడా నగ్నచిత్రాలతో నట్టికుమార్‌ బ్లాక్‌మెయిల్ చేస్తుంటారని కల్యాణ్ ఆరోపించారు. సినీ పరిశ్రమలో చాలామంది నట్టి కుమార్ బాధితులు ఉన్నారని, కానీ ఎందుకులే అని ముందుకు రావడం లేదన్నారు. గతంలో తాను తీసిన “ఎటో వెళ్లిపోయింది మనసు” చిత్రం క్లిప్పింగులను నెట్‌లో పెట్టిన వ్యక్తి నట్టికుమార్ అని ఆరోపించారు. కేసు పెట్టే పరిస్థితి రావడంతో బతిమలాడుకుని బయటపడ్డాడని చెప్పారు. నట్టికుమార్‌ దగ్గర ఆధారాలు ఉంటే బయటపెట్టాలని, అంతేకానీ అనవసరంగా మరోసారి నోరు జారితే ”చెప్పు తెగుద్ది.. తాటతీస్తా”నని నిర్మాత సి.కళ్యాణ్‌ గట్టిగా హెచ్చరించారు.

విశాఖలో నట్టికుమార్ ఆగడాలను భరించలేక తన్ని తరిమేశారన్నారు. మొత్తం మీద పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలన్నీ తెలుగు చిత్రపరిశ్రమ ఎలాంటి మోసాలు, దిగజారుడు వ్యవహారాలతో నడుస్తోందో అద్దంపడుతోంది. ముఖ్యంగా అమ్మాయిల కోసమే నయీం గ్యాంగ్‌ చిత్ర పరిశ్రమతో సంబంధాలు పెట్టుకుందని నట్టికుమార్ చెప్పడం, … లేదు నట్టికుమారే అమ్మాయిల నగ్న చిత్రాలతో బ్లాక్ మెయిల్‌ చేస్తున్నారని సీ. కల్యాణ్ ఆరోపించడాన్ని బట్టి మొత్తానికి పరిశ్రమ పోకడ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News