ముగ్గురు హీరోయిన్లతో సంబంధాలున్నాయి...

సినీ పరిశ్రమలో సినీ నిర్మాతల మధ్య పోరు దిగజారుడు స్థితికి చేరింది. పరస్పరం తెరవెనుక నిజాలను బయటపెట్టుకుంటున్నారు. తాజాగా చిల్లర కల్యాణ్‌పై నట్టికుమార్ మరోసారి ఫైర్ అయ్యారు. బ్లూఫిల్మ్‌ కేసులో జైలుకెళ్లిన చరిత్ర సి. కల్యాణ్‌ది అని విమర్శించారు. బ్లూఫిలిం కేసులో జైలుకు వెళ్లిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు. ఆఫీస్‌ బాయ్‌గా ఉన్న కల్యాణ్… ఇన్ని కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలన్నారు. సి. కల్యాణ్‌కు ముగ్గురు హీరోయిన్లతో సంబంధాలున్నాయని వాటన్నింటిని బయటపెడుతానని నట్టికుమార్ అన్నారు. […]

Advertisement
Update: 2016-08-26 04:53 GMT

సినీ పరిశ్రమలో సినీ నిర్మాతల మధ్య పోరు దిగజారుడు స్థితికి చేరింది. పరస్పరం తెరవెనుక నిజాలను బయటపెట్టుకుంటున్నారు. తాజాగా చిల్లర కల్యాణ్‌పై నట్టికుమార్ మరోసారి ఫైర్ అయ్యారు. బ్లూఫిల్మ్‌ కేసులో జైలుకెళ్లిన చరిత్ర సి. కల్యాణ్‌ది అని విమర్శించారు. బ్లూఫిలిం కేసులో జైలుకు వెళ్లిన మాట నిజం కాదా అని ప్రశ్నించారు. ఆఫీస్‌ బాయ్‌గా ఉన్న కల్యాణ్… ఇన్ని కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలన్నారు. సి. కల్యాణ్‌కు ముగ్గురు హీరోయిన్లతో సంబంధాలున్నాయని వాటన్నింటిని బయటపెడుతానని నట్టికుమార్ అన్నారు. నానక్‌రాంగూడలోని సి. కల్యాణ్ భూమిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగతంగానే సీ. కల్యాణ్‌ను ఎదుర్కొనేందుకు తాను సిద్ధమన్నారు.

అంతకు ముందు మాట్లాడిన సి. కల్యాణ్ కూడా నట్టికుమార్ పై విరుచుకుపడ్డారు. నట్టికుమార్ జీవితమంతా నీలిచిత్రాలమయమని ఆరోపించారు. నటీమణుల నగ్న చిత్రాలను తీసి బ్లాక్‌ మెయిల్ చేయడం నట్టికుమార్‌కు అలవాటు అని ఆరోపించారు. నయీం బాధితుల కంటే నట్టికుమార్ బాధితుల సంఖ్యే అధికంగా ఉంటుందన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News