వైఎస్‌ ఆత్మ సరే... బాలయ్య స్నానం సంగతేంటి?

టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్ పాలనపై చిటపటలాడారు. వైఎస్‌ ఆత్మ ఇప్పుడు కేసీఆర్‌ను ఆవహించిందని విమర్శించారు. వైఎస్ హయాంలో జలయజ్ఞం పేరుతో వేల కోట్లు దోచుకోవడంలో కీలక పాత్ర పోషించిన కేవీపీ ఇప్పుడు కేసీఆర్‌ను కూడా ఆడిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. వైఎస్ ఆత్మ వల్లే ప్రాజెక్టుల రీడిజైన్ అంటూ దోచుకునేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. పులిచింతుల ప్రాజెక్టుకు గతంలో మంత్రిగా హరీష్‌ రావు కూడా ఆమోదం తెలిపారన్నారు. ఒక వైపు ఏపీ కాంగ్రెస్ నేతలు […]

Advertisement
Update: 2016-08-19 05:17 GMT

టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్ పాలనపై చిటపటలాడారు. వైఎస్‌ ఆత్మ ఇప్పుడు కేసీఆర్‌ను ఆవహించిందని విమర్శించారు. వైఎస్ హయాంలో జలయజ్ఞం పేరుతో వేల కోట్లు దోచుకోవడంలో కీలక పాత్ర పోషించిన కేవీపీ ఇప్పుడు కేసీఆర్‌ను కూడా ఆడిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. వైఎస్ ఆత్మ వల్లే ప్రాజెక్టుల రీడిజైన్ అంటూ దోచుకునేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. పులిచింతుల ప్రాజెక్టుకు గతంలో మంత్రిగా హరీష్‌ రావు కూడా ఆమోదం తెలిపారన్నారు. ఒక వైపు ఏపీ కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్‌తో కలిసి అంటకాగుతుంటే.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం కేసీఆర్‌పై పోరాటం చేస్తామనడం విచిత్రంగా ఉందన్నారు.

అయితే ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే… ఏపీ కాంగ్రెస్ నేతలే కాదు ఏపీ టీడీపీ నేతలు, చంద్రబాబు కుటుంబసభ్యులు కూడా టీఆర్‌ఎస్ నేతలతో అంటకాగుతున్నారు. ఇది వరకే విజయవాలో పుష్కరస్నానం చేసిన బాలకృష్ణ … గురువారం మహబూబ్‌నగర్ జిల్లాలోనూ జలకమాడారు. ఇక్కడ బాలకృష్ణ పర్యటనలో ఆయన చుట్టూ ఉన్నవారంతా టీఆర్‌ఎస్ నేతలే. పైగా కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా బాలకృష్ణ వెంట ఉండి పర్యటన ఏర్పాట్లు చేశారు. బాలయ్యను మంత్రి జూపల్లి ఇంటికి తీసుకెళ్లి టిఫిన్ కూడా పెట్టారు. నది దగ్గరకు తన వాహనంలోనే బాలకృష్ణను తీసుకెళ్లారు. ఇలా బహిరంగంగా చంద్రబాబు బామ్మర్ది టీఆర్‌ఎస్ మంత్రితో అంటకాగడంతో పోలిస్తే ఏపీ కాంగ్రెస్ నేతలు రహస్యంగా టీఆర్‌ఎస్ నేతలతో అంటకాగి ఉంటే అది పెద్ద విషయమేమీ కాకపోవచ్చు. బహుశా ఇప్పటికీ అసలు సినిమా అర్థం కానిది రేవంత్ రెడ్డికే అనిపిస్తోంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News