మేం బాబులా కాదు... పోరాడుతూనే ఉంటాం...

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో జరిగిన ప్రత్యేకహోదా చర్చలో పాల్గొన్నారు. సభలో తన తొలిప్రసంగం అయినప్పటికీ విజయసాయిరెడ్డి ఎక్కడా తడబాటు లేకుండా ప్రసంగించారు.  పార్లమెంటరీ నిబంధనలను కూడా ప్రస్తావిస్తూ ఆయన ప్రసంగించారు. ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు మాట మార్చినా తాము మాత్రం పోరాడుతూనే ఉంటామని చెప్పారు. ప్రత్యేకహోదా సంజీవిని కాదని చంద్రబాబు అంటున్నారని కానీ స్పెషల్ స్టేటస్ ముమ్మాటికీ ఏపీకి సంజీవిని లాంటిదేనన్నారు. రాజకీయ, సాంకేతిక కారణాల వల్ల అధికారపక్షం ప్రైవేట్ బిల్లును ఆర్థికబిల్లుగా పరిగణించినా న్యాయపరంగా […]

Advertisement
Update: 2016-07-28 10:47 GMT

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో జరిగిన ప్రత్యేకహోదా చర్చలో పాల్గొన్నారు. సభలో తన తొలిప్రసంగం అయినప్పటికీ విజయసాయిరెడ్డి ఎక్కడా తడబాటు లేకుండా ప్రసంగించారు. పార్లమెంటరీ నిబంధనలను కూడా ప్రస్తావిస్తూ ఆయన ప్రసంగించారు. ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు మాట మార్చినా తాము మాత్రం పోరాడుతూనే ఉంటామని చెప్పారు. ప్రత్యేకహోదా సంజీవిని కాదని చంద్రబాబు అంటున్నారని కానీ స్పెషల్ స్టేటస్ ముమ్మాటికీ ఏపీకి సంజీవిని లాంటిదేనన్నారు.

రాజకీయ, సాంకేతిక కారణాల వల్ల అధికారపక్షం ప్రైవేట్ బిల్లును ఆర్థికబిల్లుగా పరిగణించినా న్యాయపరంగా చూస్తే మాత్రం ఇది ఆర్థికబిల్లు కాదని సాయిరెడ్డి చెప్పారు. ఒకవేళ దీనికి కొన్ని సవరణలు చేయాలన్నా అందుకు రాజ్యాంగంలోని నాలుగో అధికరణం ప్రకారం కొన్ని అవకాశాలున్నాయన్నారు. నిజానికి ప్రతి బిల్లులోనూ ఎంతోకొంత ఆర్థికాంశాలు ఉంటాయని ఆ లెక్కన చూసుకుంటే 70-75 శాతం వరకు బిల్లులన్నీ ఆర్థిక బిల్లులే అవుతాయన్నారు. వాటిని రాజ్యసభలో ప్రవేశ పెట్టకూడదంటే ఉభయ సభల విధానమే ప్రమాదంలో పడుతుందన్నారు.

ప్రధాని స్వయంగా ఐదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నప్పుడు వెంకయ్య నాయుడు ఐదేళ్లు సరిపోదని, పదేళ్లు ఇవ్వాలన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం నిరంతరం ఉంటుందని, పార్టీలు అధికారంలోకి రావచ్చు, రాకపోవచ్చని ఆర్థికమంత్రి చెప్పడాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వం నిరంతరం ఉంటే.. నాటి ప్రధాని ఇచ్చిన హామీని నేటి ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News