వైఎస్ రాజారెడ్డి హత్య జరిగినప్పుడు పరిటాల రవి వచ్చారా?

పరిటాల రవి హత్య వెనుక జగన్ హస్తముందని మహానాడు వేదికగా చంద్రబాబు ఆరోపించడంపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. లేనిపోని కక్షలను సృష్టించి చలికాచుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని… ఇలాంటి నీచనికృష్టమైన ఆలోచన విధానం ఒక్క చంద్రబాబునాయుడికే ఉందని భూమన మండిపడ్డారు. అసలు పరిటాల రవిని రాజకీయంగా సమాధి చేసేందే చంద్రబాబు అని ఆరోపించారు. పరిటాలరవికి ఎన్టీఆర్ మంత్రి పదవి ఇచ్చారని ఆ కృతజ్ఞతతో పరిటాల రవి.. చంద్రబాబును వ్యతిరేకించారని చెప్పారు. అది మనసులో […]

Advertisement
Update: 2016-05-27 06:05 GMT

పరిటాల రవి హత్య వెనుక జగన్ హస్తముందని మహానాడు వేదికగా చంద్రబాబు ఆరోపించడంపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. లేనిపోని కక్షలను సృష్టించి చలికాచుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని… ఇలాంటి నీచనికృష్టమైన ఆలోచన విధానం ఒక్క చంద్రబాబునాయుడికే ఉందని భూమన మండిపడ్డారు. అసలు పరిటాల రవిని రాజకీయంగా సమాధి చేసేందే చంద్రబాబు అని ఆరోపించారు. పరిటాలరవికి ఎన్టీఆర్ మంత్రి పదవి ఇచ్చారని ఆ కృతజ్ఞతతో పరిటాల రవి.. చంద్రబాబును వ్యతిరేకించారని చెప్పారు. అది మనసులో పెట్టుకుని ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిటాల రవిని రాజకీయంగా అణచివేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.

అసలు పరిటాల రవికి, వైఎస్ కుటుంబానికి మధ్య ఎలాంటి కక్షలు లేవన్నారు. అనంతపురం జిల్లాలో పరిటాల రవికి అన్యాయం జరిగిన సమయంలో వైఎస్ రాజారెడ్డి నేరుగా అనంతపురం వచ్చి పరిటాలకు మద్దతు ప్రకటించి వెళ్లారని గుర్తు చేశారు. రాజారెడ్డి హత్యకు గురైన సమయంలోనూ పరిటాల రవి పులివెందులకు వచ్చి రాజారెడ్డికి నివాళులర్పించిన విషయం గుర్తులేదా అని చంద్రబాబును ప్రశ్నించారు.

పరిటాల రవి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న జేసీ దివాకర్ రెడ్డిని పార్టీలోకి ఎలా చేర్చుకున్నారని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. తుని ఘటనలో జగన్‌ హస్తముంటే సీబీఐ విచారణ జరిపించి చర్యలు తీసుకో అని సవాల్ చేశారు. పాపులే హుండీల్లో డబ్బులు వేస్తారని చెప్పడం ద్వారా కోట్లాది భక్తుల నమ్మకంపై చావు దెబ్బకొట్టిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. తమ పార్టీ తరపున రాజ్యసభకు విజయసాయిరెడ్డి అన్ని విధాలుగా అర్హుడని చెప్పారు. తామంతా సాయిరెడ్డి ఎంపికను ఆహ్వానిస్తున్నామని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News