మ‌ళ్లీ మొద‌టికి...తాత్కాలిక రాజ‌ధాని అద‌న‌పు టెండ‌ర్లు నిలిపివేత‌ " నారాయ‌ణ‌

వెల‌గ‌పూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక రాజ‌ధాని విష‌యంలో ప్ర‌భుత్వం మ‌రో గంద‌ర‌గోళానికి తెర‌లేపింది. జూన్ నాటికి భ‌వ‌నాలు నిర్మించి ఉద్యోగుల‌ను త‌ర‌లిస్తామ‌ని తొలుత ప్ర‌భుత్వం చెప్పింది. ఇందు కోసం అత్య‌థిక ధ‌ర‌కు భ‌వ‌న నిర్మాణ పనుల‌ను కాంట్రాక్ట్ సంస్థ‌కు అప్ప‌గించింది. అయితే ఇప్పుడు ప్ర‌భుత్వం హ‌ఠాత్తుగా మ‌న‌సు మార్చుకుంది. జూన్ లోపు భ‌వ‌నాల నిర్మాణం పూర్త‌య్యే అవ‌కాశం లేద‌న్న నిర్ధార‌ణ‌కు వ‌చ్చింది. దీంతో ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌ను అద్దె భ‌వ‌నాల్లో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. ఉద్యోగుల త‌ర‌లింపుపై సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన […]

Advertisement
Update: 2016-05-21 11:42 GMT

వెల‌గ‌పూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక రాజ‌ధాని విష‌యంలో ప్ర‌భుత్వం మ‌రో గంద‌ర‌గోళానికి తెర‌లేపింది. జూన్ నాటికి భ‌వ‌నాలు నిర్మించి ఉద్యోగుల‌ను త‌ర‌లిస్తామ‌ని తొలుత ప్ర‌భుత్వం చెప్పింది. ఇందు కోసం అత్య‌థిక ధ‌ర‌కు భ‌వ‌న నిర్మాణ పనుల‌ను కాంట్రాక్ట్ సంస్థ‌కు అప్ప‌గించింది. అయితే ఇప్పుడు ప్ర‌భుత్వం హ‌ఠాత్తుగా మ‌న‌సు మార్చుకుంది. జూన్ లోపు భ‌వ‌నాల నిర్మాణం పూర్త‌య్యే అవ‌కాశం లేద‌న్న నిర్ధార‌ణ‌కు వ‌చ్చింది. దీంతో ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌ను అద్దె భ‌వ‌నాల్లో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. ఉద్యోగుల త‌ర‌లింపుపై సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

జూన్ 27 నాటికి ఉద్యోగులను త‌ర‌లించాల‌ని అందుకోసం అద్దె భ‌వ‌నాలు తీసుకోవాల‌ని సీఎం ఆదేశించారు. అద్దె భ‌వ‌నాల ద్వారా ఉద్యోగుల త‌ర‌లింపు పూర్తి చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. తాజా నిర్ణ‌యంతో తాత్కాలిక రాజ‌ధానిలో అద‌న‌పు భ‌వ‌నాల టెండ‌ర్ల‌ను నిలిపివేస్తున్న‌ట్టు మంత్రి నారాయ‌ణ చెప్పారు. ఇప్ప‌టికే గుంటూరు, విజ‌య‌వాడ‌లో అద్దె భ‌వ‌నాలను గుర్తించిన‌ట్టు నారాయ‌ణ చెప్పారు. ఉద్యోగుల సౌక‌ర్యం కోస‌మే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు. ప్ర‌భుత్వ తాజా నిర్ణ‌యంపై అంద‌రూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. అద్దె భ‌వ‌నాల్లో కార్యాల‌యాలు నిర్వ‌హించే ఉద్దేశ‌మే ఉంటే ఇలా అధిక ధ‌ర‌కు టెండ‌ర్లు పిలిచి వంద‌ల కోట్లు కాంట్రాక్ట‌ర్ల‌కు త‌గ‌లేయాల్సిన బాధ త‌ప్పేది క‌దా అంటున్నారు. నిర్ణీత కాలంలో భ‌వ‌నాలు పూర్తి చేయాల‌న్న ఉద్దేశంతోనే కాంట్రాక్ట్ సంస్థ‌కు అత్యధిక ధ‌ర‌కు భ‌వ‌నాలు నిర్మించే ప‌ని అప్ప‌గించారు. ఇప్పుడు చూస్తుంటే భ‌వ‌నాలు పూర్త‌య్యే ప‌రిస్థితి లేద‌ని ప్ర‌భుత్వ‌మే తేల్చేసింది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News