నో హ‌డావుడి..  వ‌ద‌ల‌గానే ఉప్పెనలా ప్ర‌భంజ‌నం ..!

ఈ రోజుల్లో  పెద్ద   స్టార్స్ చిత్రాలైనా ప్ర‌చారం విష‌యంలో భారీగానే చేయాల్సి వ‌స్తుంది. తెలుగు, త‌మిళ్, హింది  అనే బేదం లేదు. ఈ విష‌యంలో స్టార్స్ అంద‌రు ఒక్క‌టే. క‌ట్ చేస్తే ద‌క్షిణాది సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ మాత్రం ఈ విష‌యంలో మిన‌హాయింపు అనిపిస్తుంది. ఆయ‌న పా రంజిత్ డైరెక్ష‌న్ లో చేస్తున్న క‌బాలి చిత్రం టీజ‌ర్ ఎటువంటి హాంగామా లేకుండా రిలీజ్ చేశారు. అదే వేరే  స్టార్ హీరో చిత్ర‌మైతే ఫ‌స్ట్ లుక్ నుంచి […]

Advertisement
Update: 2016-05-03 23:19 GMT
ఈ రోజుల్లో పెద్ద స్టార్స్ చిత్రాలైనా ప్ర‌చారం విష‌యంలో భారీగానే చేయాల్సి వ‌స్తుంది. తెలుగు, త‌మిళ్, హింది అనే బేదం లేదు. ఈ విష‌యంలో స్టార్స్ అంద‌రు ఒక్క‌టే. క‌ట్ చేస్తే ద‌క్షిణాది సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ మాత్రం ఈ విష‌యంలో మిన‌హాయింపు అనిపిస్తుంది. ఆయ‌న పా రంజిత్ డైరెక్ష‌న్ లో చేస్తున్న క‌బాలి చిత్రం టీజ‌ర్ ఎటువంటి హాంగామా లేకుండా రిలీజ్ చేశారు.
అదే వేరే స్టార్ హీరో చిత్ర‌మైతే ఫ‌స్ట్ లుక్ నుంచి ప్ర‌చార ఎత్తుగ‌డ‌లు ప్రారంభించే వారు. కానీ ర‌జ‌నీకాంత్ విష‌యంలో ఆ హ‌డావుడి క‌నిపించదు. తాజాగా చేసిన క‌బాలి చిత్రం ..టీజ‌ర్ మొన్న త‌మిళ్, తెలుగులో రిలీజ్ చేశారు. ఏ విధ‌మైన హ‌డావుడి లేకుండా రిలీజ్ చేసిన‌ప్ప‌టికి.. ఇంట‌ర్నెట్ లో ఆ టీజ‌ర్ వైర్ లా పాకింది. విడుద‌లైన 24 గంట‌ల లోపే 5 మిలియ‌న్ల వ్యూస్ ప‌డ్డాయి. సర్వ‌త్ర టీజ‌ర్ చాలా బావుంద‌నే టాక్ వినిపిస్తుంది. తెల్ల గ‌డ్డంలో ర‌జ‌నీకాంత్ లుక్ నేచుర‌ల్ గా ఉండ‌టం సినిమాకు ప్ల‌స్ పాయింట్. మీరు గ్యాంగ్ స్ట‌ర్ ఎందుక అయ్యారు అనే ప్ర‌శ్న‌కు ఆయ‌న చెప్పిన స‌మాధానం..డైలాగ్ అన్ని వెర‌సి అద‌ర‌హొ అనిపించేలా ఉంది.
శివాజీ చిత్రంలో ర‌జ‌నీకాంత్ చెప్పిన‌ట్లు.. సింహం సింగిల్ గా వ‌స్తుంది అన్న‌ట్లు… ఏ విధ‌మైన హ‌డావుడి లేకుండానే ఇంత ప్ర‌భంజ‌నం చేస్తే.. ప్రచారం చేసి వ‌దిలితే ఇంకెతగా ఉండేదో క‌దా..! ద‌టీజ్ ర‌జ‌నీకాంత్ ఫాలోయింగ్ అంటున్నారు ఆయ‌న వీరాభిమానులు. ఈ చిత్రం జూన్ లో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జరుపుకుంటుంది. రాధిక ఆప్టే ర‌జ‌ని స‌ర‌స‌న హీరోయిన్ గా చేశారు.
Tags:    
Advertisement

Similar News