బూతులు తిట్టుకున్న బోండా ఉమా, చెవిరెడ్డి

టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి పరస్పరం తిట్టుకున్నారు. ఒక టీవీ చర్చా కార్యక్రమంలో ఇద్దరు నేతలు పాల్గొన్నారు. బీజేపీ, టీడీపీ మధ్య అంతర్గత విబేధాల వల్ల రాష్ట్రం ఎంతవరకు నష్టపోతోందన్న దానిపై చర్చ నిర్వహించారు. ప్రజలను మభ్య పెట్టడంతో చంద్రబాబుకు ఉన్నంత అనుభవం ఎవరికీ లేదని చెవిరెడ్డి అనడంతో … బోండా ఉమా జగన్‌ కేసులను ప్రస్తావించారు. జైల్లో జగన్‌కు ఉన్నంత అనుభవం కూడా ఎవరికీ లేదని   ఉమా అన్నారు. అంతటితో ఆగకుండా […]

Advertisement
Update: 2016-04-20 08:05 GMT

టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి పరస్పరం తిట్టుకున్నారు. ఒక టీవీ చర్చా కార్యక్రమంలో ఇద్దరు నేతలు పాల్గొన్నారు. బీజేపీ, టీడీపీ మధ్య అంతర్గత విబేధాల వల్ల రాష్ట్రం ఎంతవరకు నష్టపోతోందన్న దానిపై చర్చ నిర్వహించారు. ప్రజలను మభ్య పెట్టడంతో చంద్రబాబుకు ఉన్నంత అనుభవం ఎవరికీ లేదని చెవిరెడ్డి అనడంతో … బోండా ఉమా జగన్‌ కేసులను ప్రస్తావించారు. జైల్లో జగన్‌కు ఉన్నంత అనుభవం కూడా ఎవరికీ లేదని ఉమా అన్నారు. అంతటితో ఆగకుండా మీరంతా ఎర్రచందనం దొంగలు అంటూ వ్యాఖ్యానించారు. ‘’పగలు ఇంట్లో ఉంటాడు… రాత్రి అడవిలో ఉంటాడు’’ అంటూ చెవిరెడ్డిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇందుకు చెవిరెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. “తిరుపతి ఇనుప సామాన్లు అమ్ముకుని పోలీసులకు పట్టుబడిన నీవా నీతులు చెప్పేది అంటూ” చెవిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇలా మాటామాటా పెరిగి చివరకు ఇద్దరు ఓరేయ్ … ఓరేయ్ అంటూ తిట్టుకున్నారు. ‘’ఓరేయ్ చెవిరెడ్డి వైసీపీలో నిన్ను మించిన పనికిమాలిన వాడు లేడు’’ అంటూ బోండా ఉమా అన్నారు. దీంతో చెవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘’ఓరేయ్ నేను ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తుంటే కేసులెందుకు పెట్టడం లేదురా’’ అని ప్రశ్నించారు. ‘’నీకు మీ నాయకుడికి దమ్ముంటే నా పై కేసులు పెట్టండి రా’’ అని చెవిరెడ్డి అటాక్ చేశారు. ‘’సబ్జెట్ తెలియదు ఏమీ తెలియదు ఎందుకు మాట్లాడుతావ్ రా’’ అని చెవిరెడ్డి అన్నారు. ఇలా ఓ ఐదు నిమిషాల పాటు ఇద్దరు నేతలు తిట్టుకున్నారు. చివరకు బోండా ఉమా వెనక్కు తగ్గారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News