డైరెక్టర్‌ పూరిపై దాడి

డైరెక్టర్‌ పూరిజగన్నాథ్‌పై డిస్టిబ్యూటర్లు దాడిచేశారు. తొలుత పూరి ఇంటివద్ద నానా రభస సృష్టించిన ముగ్గురు డిస్టిబ్యూటర్లు అనంతరం డైరెక్టర్‌ ఆఫీసు పైన దాడికి దిగారు. దాడిచేసిన డిస్టిబ్యూటర్లు అభిషేక్‌, ముత్యాలు, సుధీర్‌ లు గతంలో పూరి డైరెక్షన్‌లో తెరకెక్కిన లోఫర్‌ సినిమాను డిస్టిబ్యూట్‌ చేశారు. అయితే ఆ సినిమా వల్ల తమకు నష్టాలు వచ్చాయంటూ డిస్టిబ్యూటర్లు దాడి చేశారు. భవిష్యత్తులో పూరి డైరెక్ట్‌చేసే సినిమాలను డిస్టిబ్యూట్‌ చేసే హక్కులు తమకే ఇవ్వాలని డిస్టిబ్యూటర్ల డిమాండ్‌. అయితే దీనికి […]

Advertisement
Update: 2016-04-16 09:00 GMT

డైరెక్టర్‌ పూరిజగన్నాథ్‌పై డిస్టిబ్యూటర్లు దాడిచేశారు. తొలుత పూరి ఇంటివద్ద నానా రభస సృష్టించిన ముగ్గురు డిస్టిబ్యూటర్లు అనంతరం డైరెక్టర్‌ ఆఫీసు పైన దాడికి దిగారు. దాడిచేసిన డిస్టిబ్యూటర్లు అభిషేక్‌, ముత్యాలు, సుధీర్‌ లు గతంలో పూరి డైరెక్షన్‌లో తెరకెక్కిన లోఫర్‌ సినిమాను డిస్టిబ్యూట్‌ చేశారు. అయితే ఆ సినిమా వల్ల తమకు నష్టాలు వచ్చాయంటూ డిస్టిబ్యూటర్లు దాడి చేశారు. భవిష్యత్తులో పూరి డైరెక్ట్‌చేసే సినిమాలను డిస్టిబ్యూట్‌ చేసే హక్కులు తమకే ఇవ్వాలని డిస్టిబ్యూటర్ల డిమాండ్‌. అయితే దీనికి సానుకూల స్పందన వ్యక్తం కాకపోవడంతో ఏకంగా దాడికి దిగారు. దాడి చేసిన ముగ్గురు డిస్టిబ్యూటర్లపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో పూరి ఫిర్యాదు చేశారు. దాడి చేసినవారిపై 323, 506, 384 సెక్షన్లకింద కేసు నమోదుచేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News