చిరంజీవి రిటైర్మెంట్ ఎప్పుడు...?

సరైనోడు విజయోత్సవ వేడుక సందర్భంగా తన రిటైర్మెంట్ కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మెగాస్టార్ చిరంజీవి. తన రిటైర్మెంట్ కు, విశాఖకు లింక్ పెడుతూ మాట్లాడారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి విశాఖతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు మెగాస్టార్. తన సినిమాలకు సంబంధించి ఏదో ఒక షూటింగ్ విశాఖలో జరిగేదని… ఇక్కడి ప్రజల అభిమానాన్ని జీవితంలో మరిచిపోలేనని చెప్పుకొచ్చారు. అంతేకాదు… తను కనుక సినిమా నుంచి రిటైర్ అయితే… కచ్చితంగా విశాఖలోనే స్థిరపడతానని కూడా […]

Advertisement
Update: 2016-04-11 03:48 GMT
సరైనోడు విజయోత్సవ వేడుక సందర్భంగా తన రిటైర్మెంట్ కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మెగాస్టార్ చిరంజీవి. తన రిటైర్మెంట్ కు, విశాఖకు లింక్ పెడుతూ మాట్లాడారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి విశాఖతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు మెగాస్టార్. తన సినిమాలకు సంబంధించి ఏదో ఒక షూటింగ్ విశాఖలో జరిగేదని… ఇక్కడి ప్రజల అభిమానాన్ని జీవితంలో మరిచిపోలేనని చెప్పుకొచ్చారు. అంతేకాదు… తను కనుక సినిమా నుంచి రిటైర్ అయితే… కచ్చితంగా విశాఖలోనే స్థిరపడతానని కూడా చిరంజీవి సెలవిచ్చారు. ఈ ప్రకటనతో ఒక్కసారిగా విశాఖ ప్రజలు జయజయధ్వానాలు చేశారు. చిరంజీవికి తామంటే ఎంత అభిమానం అని పొంగిపోయారు. అయితే చిరంజీవికి విశాఖలో వందల ఎకరాల స్థలం ఉందని… అక్కడ ఆయన ఫిలింసిటీ నిర్మించే ఆలోచనలో ఉన్నారని… అందుకే విశాఖలో సెటిలైపోతున్నారనే విషయాన్ని మాత్రం చాలా కొద్ది మంది మాత్రమే అర్థం చేసుకున్నారు.
Tags:    
Advertisement

Similar News