రోజా విషయంలో వెనక్కు తగ్గే యోచన ? సంకేతాలు పంపిన సర్కార్!

ఎవరిని క్షమించినా రోజాను మాత్రం క్షమించేది లేదు.  ఆమె విషయంలో పునరాలోచనే లేదు. ఇంతకాలం రోజా ఏడాది సస్పెన్షన్‌పై టీడీపీ నేతల నుంచి వినిపించిన సింగిల్ డైలాగ్. అయితే ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది.  ప్రివిలేజ్ కమిటీ నివేదికపై అసెంబ్లీలో చర్చ అనంతరం ప్రభుత్వ స్వరంలో మార్పు  కనిపించింది. నాలుగు సార్లు నోటీసులు ఇచ్చినా ప్రివిలేజ్ కమిటీ ముందు రోజా హాజరు కాలేదు కాబట్టి ఏడాది వేటు వేసేందుకు సభ నిర్ణయిస్తుందని అందరూ భావించారు. కమిటీ […]

Advertisement
Update: 2016-03-21 10:53 GMT

ఎవరిని క్షమించినా రోజాను మాత్రం క్షమించేది లేదు. ఆమె విషయంలో పునరాలోచనే లేదు. ఇంతకాలం రోజా ఏడాది సస్పెన్షన్‌పై టీడీపీ నేతల నుంచి వినిపించిన సింగిల్ డైలాగ్. అయితే ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ప్రివిలేజ్ కమిటీ నివేదికపై అసెంబ్లీలో చర్చ అనంతరం ప్రభుత్వ స్వరంలో మార్పు కనిపించింది.

నాలుగు సార్లు నోటీసులు ఇచ్చినా ప్రివిలేజ్ కమిటీ ముందు రోజా హాజరు కాలేదు కాబట్టి ఏడాది వేటు వేసేందుకు సభ నిర్ణయిస్తుందని అందరూ భావించారు. కమిటీ సిఫార్సు చేసినట్టు ఎమ్మెల్యేగా రోజాకు అందే అలవెన్స్‌లు ఆపివేస్తారని భావించారు. కానీ నివేదికపై చర్చ అనంతరం ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరయ్యేందుకు రోజాకు మరోచాన్స్ ఇస్తున్నట్టు అసెంబ్లీ ప్రకటించింది. అంతవరకు సస్పెన్షన్ అమలులో ఉంటుందని వెల్లడించింది. అంటే ఒకవిధంగా ప్రభుత్వమే ఒక మెట్టు దిగినట్టుగా ఉంది. ఒకవేళ రోజా ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరై జ్యోతుల నెహ్రు, చెవిరెడ్డి, శ్రీధర్ రెడ్డి తరహాలోనే క్షమాపణ చెబితే సస్పెన్షన్‌పై పునరాలోచన చేసే చాన్స్ ఉందంటున్నారు.

రోజా కమిటీ ముందు హాజరై క్షమాపణ చెప్పిన తర్వాత కూడా సస్పెన్షన్ ఎత్తివేయకుంటే అప్పుడు ప్రభుత్వానికే మరింత చెడ్డ పేరు వస్తుంది. ఒకవేళ రోజాపై సస్పెన్షన్ ఎత్తివేసే యోచనే లేకపోతే ప్రభుత్వం ఇలా మరో చాన్స్ ఇచ్చేది కాదంటున్నారు. పైగా తప్పులు అందరూ చేస్తారని, ముఖ్యమంత్రులు కూడా తప్పులు చేసిన దాఖలాలు ఉన్నాయని వాటిని సరిదిద్దుకుంటే సరిపోతుందని స్వయంగా స్పీకరే సభలో చెప్పారు. అంటే రోజా ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరై క్షమాపణ చెబితే సస్పెన్షన్ ఎత్తివేయక తప్పదన్న భావన వ్యక్తమవుతోంది.

ఒకవేళ ప్రభుత్వం అలా చేయని పక్షంలో స్పీకర్‌ చెప్పినట్టు అందరూ తప్పులు చేస్తారు… వాటిని సరిదిద్దుకోవాలని అన్న మాటలను లెక్కచేసినట్టుగా ఉండదు. పైగా కొడాలి నాని విషయంలోనూ ప్రభుత్వం వెనక్కు తగ్గడం గమనార్హం. కొడాలిపై చర్యలు తీసుకోవాలని ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు చేసినా చర్యలు తీసుకునే అంశాన్ని వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో రోజా ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరై క్షమాపణ చెబితే సస్పెన్షన్ ఎత్తివేసే యోచనలో ప్రభుత్వం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా రోజా విషయం ద్వారా ఏకంగా కోర్టులతో ఘర్షణపడుతున్నట్టు పరిస్థితి తయారవడంతో ప్రభుత్వం లోలోన ఆందోళన చెందుతున్నట్టుగా ఉంది. చూడాలి ఏం జరుగుతుందో?

Click on Image to Read:

 

 

 

 

Tags:    
Advertisement

Similar News