బాబును వెంటాడుతున్న గ‌త జ్ఞాప‌కాలు ఇవే!

చంద్రబాబు రెండు క‌ళ్ల సిద్ధాంతం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చిన‌ట్టుగా ఉంది. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఏపీకి వెళ్లి అన్యాయంగా విభ‌జించార‌ని చెప్పిన చంద్రబాబు…అదే  మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు వెళ్లి తానిచ్చిన లేఖ వ‌ల్లే రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగింద‌ని చెప్పారు. ఇలా ఒక్కో రాష్ట్రంలో చంద్ర‌బాబు ఒక్కోలా మాట్లాడ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల పాలైంది. తాజాగా ఎమ్మెల్యేల కొనుగోలు, అమ్మ‌కాల‌పైనా చంద్రబాబు అప్పుడు ఇప్పుడు చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. బాబు  ఇజ్జ‌త్‌ను తీసివేస్తున్నాయి. తెలంగాణ‌లో టీడీపీ ఎమ్మెల్యేల‌ను టీఆర్ఎస్ […]

Advertisement
Update: 2016-02-24 00:51 GMT

చంద్రబాబు రెండు క‌ళ్ల సిద్ధాంతం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చిన‌ట్టుగా ఉంది. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఏపీకి వెళ్లి అన్యాయంగా విభ‌జించార‌ని చెప్పిన చంద్రబాబు…అదే మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు వెళ్లి తానిచ్చిన లేఖ వ‌ల్లే రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగింద‌ని చెప్పారు. ఇలా ఒక్కో రాష్ట్రంలో చంద్ర‌బాబు ఒక్కోలా మాట్లాడ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల పాలైంది. తాజాగా ఎమ్మెల్యేల కొనుగోలు, అమ్మ‌కాల‌పైనా చంద్రబాబు అప్పుడు ఇప్పుడు చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. బాబు ఇజ్జ‌త్‌ను తీసివేస్తున్నాయి. తెలంగాణ‌లో టీడీపీ ఎమ్మెల్యేల‌ను టీఆర్ఎస్ చేర్చుకున్న‌ప్పుడు చంద్ర‌బాబు ఏమ‌న్నారు… ఇప్పుడు ఏపీలో ఎలా చేర్చుకుంటున్నారు అన్న దానిపై సోష‌ల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. అస‌లు టీ ఎమ్మెల్యేల విష‌యంలో ఏమ‌న్నారు అన్న‌ది ఒక సారి చూస్తే..

రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్య‌క్షుడి ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మంలో బాబు చేసిన ప్ర‌సంగం ఆయ‌న మాట‌ల్లోనే…

”సంత‌లో ప‌శువులు మాదిరిగా ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసి అదే బ‌ల‌మ‌ని భ్ర‌మ‌ప‌డుతున్నారు. చేత‌నైతే ఫిరాయించిన ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించి ఎన్నిక‌ల‌కు రావాలి. ఎవ‌రి స‌త్తా ఏమిటో తెలుస్తుంది. మేం సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధ‌మో కాదో తేల్చుకుని చెప్పండి. ఇదే నా స‌వాల్ . ఏమంటారు త‌మ్ముళ్లు… !”

మ‌రోసారి గ్రేట‌ర్ ఎన్నిక ప్ర‌చార స‌భ‌లో చంద్ర‌బాబు ఏమ‌న్నారంటే…

”స‌న‌త్ న‌గ‌ర్ సెగ్మెంట్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న త‌ల‌సాని ఏ పార్టీ నుంచి గెలిచాడు త‌మ్ముళ్లు?. ఏ పార్టీ నుంచి గెలిచి ఏ పార్టీలో ఉన్నారో తలసాని సమాధానం చెప్పాలి. ఇది న్యాయమా !… టీడీపీ తరపున గెలిచి రాజీనామా కూడా చేయకుండా హీరోలాగా మంత్రి పదవిలో కొనసాగుతున్నారంటే ఏమనాలి తమ్ముళ్లు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా తమ్ముళ్లు !. అలాంటి వ్యక్తులను చిత్తు చిత్తుగా ఓడించాలి. స్వార్థంతో కొందరు నేతలు పార్టీని వీడి వెళ్లినా కార్యకర్తలు చెక్కు చెదరలేదు. ఒకరు పోతే వందమందిని తయారు చేసే శక్తి మనకుంది. ఏమంటారు తమ్ముళ్లు.. అవునా కాదా!.”

టీఆర్ఎస్ ను విమర్శించడమే కాదు. తన కర్తవ్యాన్ని, రాజ్యంగం నిర్దేశించిన మేరకు ముఖ్యమంత్రి ప్రతిపాదన ఆధారంగా తలసాని చేత ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ నరసింహన్‌పైనే టీడీపీ నేత‌లు తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. మ‌రి భూమా నాగిరెడ్డికి కూడా మంత్రి ప‌ద‌వి ఇస్తార‌ని చెబుతున్నారు. అదే జ‌రిగితే గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ వ‌ద్ద ఏపీ టీడీపీ నేత‌ల తీరు ఎలా ఉంటుందో చూడాలి.

Click on image to read:

 

Tags:    
Advertisement

Similar News