జేమ్స్ బాండ్  సిరిస్  సీక్రెట్ మ్యారేజ్ బ‌ట్ట బ‌య‌లు

హాలీవుడ్ నటుడు డానియల్ క్రేగ్ బాండ్ మూవీ ‘స్పెక్టర్’ విడుదల కావడంతో అతని జీవితానికి సంబంధించిన ఓ రహస్యం బహిర్గతమైంది. ప్రముఖ నటి రేచల్ వెయిజ్‌ను డానియల్ క్రేగ్ నాలుగేళ్ళ క్రితమే(2011) వివాహం చేసుకున్నాడట. అయితే జేమ్స్ బాండ్‌గా అతను నటిస్తున్న ఆఖరి చిత్రం ‘స్పెక్టర్’ విడుదలయ్యే వరకూ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని భావించారట.   ఇక తాజాగా ‘స్పెక్టర్’ మూవీ విడుదలైంది. హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు రహస్యంగా ఉంచిన ఈ […]

Advertisement
Update: 2015-11-23 19:02 GMT

హాలీవుడ్ నటుడు డానియల్ క్రేగ్ బాండ్ మూవీ ‘స్పెక్టర్’ విడుదల కావడంతో అతని జీవితానికి సంబంధించిన ఓ రహస్యం బహిర్గతమైంది. ప్రముఖ నటి రేచల్ వెయిజ్‌ను డానియల్ క్రేగ్ నాలుగేళ్ళ క్రితమే(2011) వివాహం చేసుకున్నాడట. అయితే జేమ్స్ బాండ్‌గా అతను నటిస్తున్న ఆఖరి చిత్రం ‘స్పెక్టర్’ విడుదలయ్యే వరకూ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని భావించారట.
ఇక తాజాగా ‘స్పెక్టర్’ మూవీ విడుదలైంది. హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు రహస్యంగా ఉంచిన ఈ విషయాన్ని వారే స్వయంగా బయట పెట్టారు. ‘స్పెక్టర్’ మూవీ వివరాల్లోకి వెళితే… హాలీవుడ్ సిరీస్ జేమ్స్ బాండ్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చివరి జేమ్స్ బాండ్ మూవీ ‘స్కై ఫాల్’ 2012లో విడుదలైంది. ఇది జేమ్స్ బాండ్ సీరిస్ లో వచ్చిన 23వ సినిమా. ఇక 24వ జేమ్స్ బాండ్ సినిమా ‘స్పెక్టర్’ ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. కొన్ని దేశాల్లో అంతకంటే ముందే విడుదలైంది.

స్కై ఫాల్’ చిత్రానికి దర్శకత్వం వహించిన సామ్ మెండెస్ మరోసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. కాసినో రాయల్(2006), క్వాంటమ్ ఆఫ్ సోలెస్(2008) , స్కైఫాల్(2012) చిత్రాల్లో నటించిన డేనియల్ క్రెగ్ నాలుగోసారి 007 ఏజెంట్ పాత్రలో నటించాడు. ఈ సినిమా తర్వాత తాను మరోసారి జేమ్స్ బాండ్ పాత్ర చేయనుగాక చేయను అంటున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో డేనియర్ క్రెగ్ మాట్లాడుతూ ‘మరోసారి జేమ్స్ బాండ్ గా నటించడం కంటే చచ్చిపోవడం బెటర్. అలాంటి పరిస్థితి వస్తే ఏదైనా గాజుముక్కతో నా మణికట్టును కోసుకుంటా’ అని వ్యాఖ్యానించారు. మరోసారి నన్ను చేయమని అడిగితే రెండేళ్లు ఆగమంటాను. రెండేళ్ల తర్వాత ఒక వేళ చేయాలని అనిపిస్తే… అది డబ్బు కోసమే తప్ప మరో కారణం ఉండదు అన్నాడు.

Tags:    
Advertisement

Similar News