రోజాతో నాగ‌బాబు జ‌బ‌ర్ద‌స్త్ ఢీ

ఎమ్మెల్యే క‌మ్ న‌టిగా ఫైర్‌బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్న రోజా మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబును ఢీకొడుతున్నారు. ఇద్ద‌రు జ‌డ్జిలు ఢీ అంటే ఢీ అంటున్నారు. నాగ‌బాబు, రోజాలిద్ద‌రూ ప్ర‌ముఖులుగా తెలుగు ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితులే అయినా.. జ‌బ‌ర్దస్త్ జ‌డ్జీలుగా ఇంకా ఫేమ‌స్ అయ్యారు. జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో న్యాయ‌నిర్ణేత‌లుగా బాగా పేరు గ‌డించిన ఈ ఇద్ద‌రు ..ఈ కార్య‌క్ర‌మానికి స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా కూడా మారారు. జ‌బ‌ర్ద‌స్త్ స్కిట్‌ల‌ను ఎంజాయ్ చేస్తూనే.. స్కిట్‌ల‌లో దొర్లే బూతు మాట‌ల‌కు, డ‌బుల్ మీనింగ్ డైలాగుల‌కు […]

Advertisement
Update: 2015-09-28 19:02 GMT

ఎమ్మెల్యే క‌మ్ న‌టిగా ఫైర్‌బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్న రోజా మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబును ఢీకొడుతున్నారు. ఇద్ద‌రు జ‌డ్జిలు ఢీ అంటే ఢీ అంటున్నారు. నాగ‌బాబు, రోజాలిద్ద‌రూ ప్ర‌ముఖులుగా తెలుగు ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితులే అయినా.. జ‌బ‌ర్దస్త్ జ‌డ్జీలుగా ఇంకా ఫేమ‌స్ అయ్యారు. జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో న్యాయ‌నిర్ణేత‌లుగా బాగా పేరు గ‌డించిన ఈ ఇద్ద‌రు ..ఈ కార్య‌క్ర‌మానికి స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా కూడా మారారు. జ‌బ‌ర్ద‌స్త్ స్కిట్‌ల‌ను ఎంజాయ్ చేస్తూనే.. స్కిట్‌ల‌లో దొర్లే బూతు మాట‌ల‌కు, డ‌బుల్ మీనింగ్ డైలాగుల‌కు త‌మ జ‌డ్జీ పెద్ద‌రికం న‌వ్వుల‌ను పూసి జ‌న‌రంజ‌కంగా తీర్చిదిద్దిన ఇద్ద‌రూ ఒకే రంగంలో త‌ల‌ప‌డాల‌ని చూస్తున్నారు. నేరుగా త‌ల‌ప‌డ‌క‌పోయినా..ఒకేసారి ఇద్ద‌రూ త‌మ అదృష్టానికి ప‌రీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. నాగ‌బాబు, రోజాలు తీసుకున్న నిర్ణ‌యం సినిమా ఇండ‌స్ర్టీలో సెన్సేష‌న్ రేపుతోంది. సినిమా రంగంలో సెంటిమెంట్ల‌కు భిన్నంగా ఇద్ద‌రూ త‌మ కూతుర్ల‌ను హీరోయిన్లుగా ప‌రిచ‌యం చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. తెలుగు టెలివిజ‌న్ చ‌రిత్ర‌లో సంచ‌ల‌నం సృష్టించిన కాస్త కామెడీ, మోతాదుకు మించిన బూతు క‌లిసిన జ‌బ‌ర్ద‌స్త్ జ‌డ్జీలిద్ద‌రూ ఒకేసారి త‌మ త‌న‌య‌ల‌ని వెండితెర‌కు ప‌రిచ‌యం చేయడం ఇండ‌స్ర్టీలో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

నాగ‌శౌర్య నీహారిక కాంబినేష‌న్
మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు హీరోలు మాత్రమే వచ్చారు. అయితే నాగబాబు త‌న మెగా ఫ్యామిలీ ట్రెండ్‌ను ఫాలో అవుతూనే.. కొత్త ట్రెండ్ సెట్ చేశారు. త‌న కూతురు నీహారికను హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు. హీరో నాగశౌర్య సరసన హీరోయిన్‌గా నీహారిక న‌టించ‌నున్న ఈ సినిమాకు మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు ద‌ర్శ‌కుడు రామ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. లవ్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ గా తెర‌కెక్కే ఈ సినిమాను మ‌ధుర‌శ్రీధ‌ర్‌, టీవీ 9 క‌లిపి నిర్మిస్తున్నాయ‌ని స‌మాచారం. ఈ టీవీలో వ‌చ్చే డ్యాన్స్ షో ఢీ ద్వారా యాంక‌ర్‌గా స‌త్తా చాటిన నీహారిక అఖిల్ స‌ర‌స‌న ఓ షార్ట్ ఫిలింలో కూడా న‌టించింది. ఇప్పుడు ఏకంగా హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతోంది. మెగా ఫ్యామిలీ నుంచి వ‌స్తున్న మొద‌టి హీరో త‌న స‌త్తా ఏమేర‌కు చాటుతుందో చూడాలి.

రోజా కూతురు తెరంగ్రేటానికి రంగం సిద్ధం
త‌న సాటి జ‌బ‌ర్ద‌స్త్ జ‌డ్జి నాగ‌బాబు కూతురు హీరోయిన్‌గా సినిమా ప్ర‌క‌టించేయ‌డంతో రోజా కూడా ఒక‌డుగు ముందుకేసింది. త‌న కూతురుని త్వ‌ర‌లోనే తెరంగేట్రం చేయిస్తాన‌ని సంకేతాలు ఇచ్చింది. రోజా కుమార్తె అన్షు మల్లిక ఇప్పటికే ఓ తమిళ చిత్రంలో బాల‌న‌టిగా యాక్ట్ చేసింది. ఇప్పుడు హీరోయిన్‌గా ప‌రిచ‌యం చేసే ప్ర‌య‌త్నాల్లో ఫోటో షూట్ కూడా పూర్త‌య్యింద‌ట‌. రోజా ప్ర‌య‌త్నాలు స‌ఫ‌ల‌మైతే త్వ‌ర‌లోనే ఆమె కుమార్తె అన్షు మ‌ల్లిక హీరోయిన్‌గా ప‌రిచ‌యం కానుంది. మొత్తానికి ఇద్ద‌రు జ‌బ‌ర్ద‌స్త్ జ‌డ్జీల కూతుర్లు హీరోయిన్‌లుగా ప‌రిచ‌యం కావ‌డం విశేషంగా చెప్పుకుంటున్నారు ప్రేక్ష‌కులు.

Tags:    
Advertisement

Similar News