మెగాస్టార్ కోసం వస్తున్న సూపర్ స్టార్

చిరంజీవి షష్టిపూర్తి వేడుకల కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మరో 2 రోజుల్లో అంటే ఈనెల 22న చిరంజీవి తన 60వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ బర్త్ డేను మరపురాని వేడుకగా మార్చేందుకు మెగా కాంపౌండ్ చాలా కష్టపడుతోంది. ఓవైపు అభిమానుల్ని కలుపుకుపోతూనే.. మరోవైపు సినీప్రముఖుల్ని కూడా ఆహ్వానించి పండగ చేసుకోవాలని డిసైడైంది. ఇందులో భాగంగా కేవలం సినీప్రముఖుల కోసం 22 సాయంత్రం పార్క్ హయత్ లో గ్రాండ్ పార్టీ ఎరేంజ్ చేస్తున్నాడు రామ్ చరణ్. ఈ […]

Advertisement
Update: 2015-08-19 19:04 GMT
చిరంజీవి షష్టిపూర్తి వేడుకల కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మరో 2 రోజుల్లో అంటే ఈనెల 22న చిరంజీవి తన 60వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ బర్త్ డేను మరపురాని వేడుకగా మార్చేందుకు మెగా కాంపౌండ్ చాలా కష్టపడుతోంది. ఓవైపు అభిమానుల్ని కలుపుకుపోతూనే.. మరోవైపు సినీప్రముఖుల్ని కూడా ఆహ్వానించి పండగ చేసుకోవాలని డిసైడైంది. ఇందులో భాగంగా కేవలం సినీప్రముఖుల కోసం 22 సాయంత్రం పార్క్ హయత్ లో గ్రాండ్ పార్టీ ఎరేంజ్ చేస్తున్నాడు రామ్ చరణ్. ఈ పార్టీకి ఆహ్వానిస్తూ ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఇన్విటేషన్లు వెళ్లాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ పార్టీకి వస్తున్నట్టు సమాచారం. చిరంజీవి-రజనీకాంత్ మధ్య మంచి సంబంధాలున్నాయి. పైగా షష్టిపూర్తి వేడుకకు రజనీ లాంటి స్టార్ వస్తే ఇంకా బాగుంటుందని భావించిన మెగా కాంపౌండ్, ఆయన్ను మరింత స్పెషల్ గా ఆహ్వానించింది. రజనీ కూడా వస్తానని మాటిచ్చినట్టు తెలుస్తోంది. సో.. ఈనెల 22న పార్క్ హయత్ హొటల్ స్టార్లతో సందడిగా మారబోతుందన్నమాట.
Tags:    
Advertisement

Similar News