బాహుబ‌లి పై నెగిటివ్ టాక్...! 

అంచ‌నాలు .. ఓవ‌ర్ ఎక్స్ పెక్టేష‌న్స్ ఎంతటి వారినైన టెన్ష‌న్ లోకి నెడ‌తాయి. తాజాగా ద‌ర్శ‌క జ‌క్క‌న రాజ‌మౌళి ప‌రిస్థితి అలాగే ఉందంటున్నారు స‌న్నిహితులు.  ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు అప‌జ‌యం ఎర‌గ‌ని డైరెక్ట‌ర్ గా ముద్ర ఉంది.  ప్ర‌పంచం అంతా మాట్లాడుకునే బాహుబ‌లి ప్రాజెక్ట్ చేశాడు.  సినిమా విడుద‌ల‌కు సిద్దం అయ్యింది.  కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది. ఇప్ప‌టికే సినిమా పై భారీ అంచ‌నాలున్నాయి.  వ‌దిలిన ప్ర‌చార చిత్రాల‌న్ని బావుండ‌టంతో.. ఆడియ‌న్స్  ఓవ‌ర్ గా ఆశిస్తున్నారు.ఇది  ద‌ర్శ‌కుడికి […]

Advertisement
Update: 2015-07-01 06:25 GMT

అంచ‌నాలు .. ఓవ‌ర్ ఎక్స్ పెక్టేష‌న్స్ ఎంతటి వారినైన టెన్ష‌న్ లోకి నెడ‌తాయి. తాజాగా ద‌ర్శ‌క జ‌క్క‌న రాజ‌మౌళి ప‌రిస్థితి అలాగే ఉందంటున్నారు స‌న్నిహితులు. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు అప‌జ‌యం ఎర‌గ‌ని డైరెక్ట‌ర్ గా ముద్ర ఉంది. ప్ర‌పంచం అంతా మాట్లాడుకునే బాహుబ‌లి ప్రాజెక్ట్ చేశాడు. సినిమా విడుద‌ల‌కు సిద్దం అయ్యింది. కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది. ఇప్ప‌టికే సినిమా పై భారీ అంచ‌నాలున్నాయి. వ‌దిలిన ప్ర‌చార చిత్రాల‌న్ని బావుండ‌టంతో.. ఆడియ‌న్స్ ఓవ‌ర్ గా ఆశిస్తున్నారు.ఇది ద‌ర్శ‌కుడికి నిజంగా పెద్ద త‌ల‌నొప్పి. ఎందుకంటే..అభిమానుల అంచ‌నాల‌కు ఒక హ‌ద్దు ప‌ద్దు వుండ‌దు. వారి అంచ‌నాల్ని ఇటువంటి చిత్రాల్లో అందుకోవ‌డం సాధ్య‌ప‌డ‌దు. అందుకే సినిమా విడుద‌ల‌కు ముందు .. బాహుబ‌లి కి కొంత నెగిటివ్ ప్ర‌చారం ప్రారింభించారు. దీనివ‌ల్ల సినిమాకు లాభ‌మే త‌ప్ప పెద్ద న‌ష్టం లేదు అనేది క్రిటిక్స్ టాక్. ఎందుకంటే..నెగిటివ్ ప్ర‌చారం మూలంగా .. కొంత వ‌ర‌కు అంచ‌నాలు త‌గ్గించేకునే అవ‌కాశం ఉంది. సినిమాను ఓపెన్ మైండ్ తో చూస్తే.. ద‌ర్శ‌కుడికి హాయ్. అంచ‌నాలు లేకుండ చూస్తే.. బాహుబ‌లి చిత్రం ఔర అనిపించ‌క మాన‌దు మ‌రి.

Tags:    
Advertisement

Similar News