మళ్లీ సమంతానే దిక్కయింది

మొదట సమంతకు నో చెప్పాడు మహేష్. శ్రీకాంత్ అడ్డాల ఎంత బ్రతిమాలినప్పటికీ సమంతకు ఛాన్స్ ఇవ్వకూడదనుకున్నాడు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి చుల్ బులీకే ఛాన్స్ ఇచ్చాడు. అలా మహేష్-సమంత కాంబినేషన్ లో ముచ్చుటగా మూడో సినిమా బ్రహ్మోత్సవం ఫిక్సయింది.              మహేష్-సమంతతో కలిసి సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాలో కలిసి పనిచేసిన అనుభవం ఉంది శ్రీకాంత్ అడ్డాలకు. అందుకే సమంతనే బ్రహ్మోత్సవం సినిమాకు కూడా తీసుకుందామనుకున్నాడు. కానీ మహేష్ మాత్రం […]

Advertisement
Update: 2015-06-20 00:34 GMT
మొదట సమంతకు నో చెప్పాడు మహేష్. శ్రీకాంత్ అడ్డాల ఎంత బ్రతిమాలినప్పటికీ సమంతకు ఛాన్స్ ఇవ్వకూడదనుకున్నాడు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి చుల్ బులీకే ఛాన్స్ ఇచ్చాడు. అలా మహేష్-సమంత కాంబినేషన్ లో ముచ్చుటగా మూడో సినిమా బ్రహ్మోత్సవం ఫిక్సయింది.
మహేష్-సమంతతో కలిసి సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాలో కలిసి పనిచేసిన అనుభవం ఉంది శ్రీకాంత్ అడ్డాలకు. అందుకే సమంతనే బ్రహ్మోత్సవం సినిమాకు కూడా తీసుకుందామనుకున్నాడు. కానీ మహేష్ మాత్రం సమంతకు నో చెప్పాడు. వన్-నేనొక్కడినే సినిమా టైమ్ లో ఆ సినిమా పోస్టర్లపై సమంత చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. అలా ఇద్దరి మధ్య సంబంధాలు చెడిపోయాయి. మరోవైపు ఫ్యాన్స్ కూడా సమంతతో మళ్లీ కలిసి నటించొద్దని డిమాండ్ చేశారు. ఇవన్నీ దృష్టిలోపెట్టుకొని రకుల్ ప్రీత్ సింగ్ కు ఆఫర్ ఇచ్చాడు మహేష్.
అయితే రకుల్ ప్రీత్ సింగ్ డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయింది. ఒకేసారి రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాలకు కమిట్ అవ్వడం, అడ్వాన్సులు కూడా తీసుకోవడంతో బ్రహ్మోత్సవానికి డేట్స్ ఫిక్స్ చేయలేకపోయింది. ఇదే గ్యాప్ లో సమంత కూడా ఓసారి మహేష్ కూడా ఫోన్ చేసి అప్పటి పరిస్థితిని వివరించిందట. దీంతో బ్రహ్మోత్సవంతో తిరిగి సమంతతో కలిసి నటించడానికి సై అన్నాడు మహేష్.
Tags:    
Advertisement

Similar News