నాగినిగా కత్రినాకైఫ్

ఈ పాత్రను ఎవరూ కత్రినాకైఫ్ కు ఇప్పటివరకు ఆఫర్ చేయలేదు. కానీ ఆమె మనసులో మాత్రం ఈ పాత్ర అలా నిలిచిపోయింది. ప్రతి హీరోయిన్ కు ఫలానా క్యారెక్టర్ చేస్తే బాగుంటుందనే చిరకాల వాంఛ ఉంటుంది. అలా కత్రినా మనసులో నాగిని పాత్ర ఉండిపోయింది. కెరీర్ స్టార్టింగ్ లోనే ఆమె నాగిని పాత్రలపై మొగ్గుచూపింది. దీనికి కారణం కూడా ఉంది.                 కెరీర్ ప్రారంభంలో కత్రినాపై చాలా విమర్శలొచ్చాయి. […]

Advertisement
Update: 2015-06-11 23:25 GMT
ఈ పాత్రను ఎవరూ కత్రినాకైఫ్ కు ఇప్పటివరకు ఆఫర్ చేయలేదు. కానీ ఆమె మనసులో మాత్రం ఈ పాత్ర అలా నిలిచిపోయింది. ప్రతి హీరోయిన్ కు ఫలానా క్యారెక్టర్ చేస్తే బాగుంటుందనే చిరకాల వాంఛ ఉంటుంది. అలా కత్రినా మనసులో నాగిని పాత్ర ఉండిపోయింది. కెరీర్ స్టార్టింగ్ లోనే ఆమె నాగిని పాత్రలపై మొగ్గుచూపింది. దీనికి కారణం కూడా ఉంది.
కెరీర్ ప్రారంభంలో కత్రినాపై చాలా విమర్శలొచ్చాయి. ఫేస్ అస్సలు బాగాలేదని, యాక్టింగ్ పనికిరాదని, డాన్స్ పరమ చెత్తగా ఉందని కామెంట్స్ వినిపించాయి. వాటిని అధిగమించేందుకు పాత బాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూసింది కత్రిన. అందులో భాగంగా శ్రీదేవి, వహీదా రెహ్మాన్, వైజయంతీమాల నటించిన సినిమాలు చూసింది. వాళ్లు చేసిన నాగిని పాత్రలు, నాగిని స్టెప్పులు అప్పట్లోనే కత్రినాను ఆకట్టుకున్నాయి. ఎప్పట్నుంచో మనసులో ఉన్న ఆ కోరికను ఈమధ్యే మీడియా ముందు బయటపెట్టింది కత్రిన. మరి ఈ సన్నజాజికి కూడా ఎవరైనా అలాంటి పాత్రలు ఇస్తారేమో చూడాలి.
Tags:    
Advertisement

Similar News