ఎట్ట‌కేల‌కు ప‌ల్లా రాజేశ్వ‌ర‌రెడ్డి గెలుపు

హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక హోరాహోరీగా, నువ్వా నేనా అన్నట్లు సాగింది! మొదటి రౌండ్లో గెలుపు ఖాయమనుకున్న ఆయన రెండో రౌండ్ వరకు కూడా అది సాధ్యం కాలేదు. బీజేపీతో పోటాపోటీగా బరిలో నిలిచిన అధికార టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి రెండో ప్రాధాన్యతా ఓట్లతో గెలిచి ‘హమ్మయ్య’అంటూ ఊపిరి పీల్చుకున్నారు. మొత్తంమీద, 11,773 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రాంమోహన్ రావుపై గెలిచారు. వాస్తవానికి, ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు నల్లేరుపై […]

Advertisement
Update: 2015-03-27 00:32 GMT
హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక హోరాహోరీగా, నువ్వా నేనా అన్నట్లు సాగింది! మొదటి రౌండ్లో గెలుపు ఖాయమనుకున్న ఆయన రెండో రౌండ్ వరకు కూడా అది సాధ్యం కాలేదు. బీజేపీతో పోటాపోటీగా బరిలో నిలిచిన అధికార టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి రెండో ప్రాధాన్యతా ఓట్లతో గెలిచి ‘హమ్మయ్య’అంటూ ఊపిరి పీల్చుకున్నారు. మొత్తంమీద, 11,773 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రాంమోహన్ రావుపై గెలిచారు. వాస్తవానికి, ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు నల్లేరుపై నడకని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఫలితం వస్తే గాని టీఆర్ఎస్ పరిస్థితి ఏమిటో ఆయనకు తెలిసి రాలేదు. భారీ సంఖ్యలో మంత్రులను మోహరించారని, ప్రచార పర్వానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు సమకూర్చడమే కాకుండా… అధికార పక్షం సర్వశక్తులూ ఒడ్డిందని ఆరోపణలూ వచ్చాయి. అయినా, అధికార పార్టీ అభ్యర్థిని మొదటి ప్రాధాన్య ఓట్లతో గెలిపించడానికి పట్టభద్రులు విముఖత వ్యక్తం చేశారు. మొత్తం ఓట్లు 2,81,138. కాగా, పోల్ అయిన ఓట్లు 1,53,548. వీటిలో చెల్లని ఓట్లు 14,039. పోల్ అయిన ఓట్లలో చెల్లనివి తొలగించగా మిగిలినవి 1,33,553. మొదటి ప్రాధాన్యతా ఓటుతో ఏ అభ్యర్థి అయినా విజయం సాధించాలంటే 66,777 ఓట్లు పొందాల్సి ఉంది. మొదటి ప్రాధాన్యతా లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి 59,764 ఓట్లు సాధించగా, ఆయన సమీప ప్రత్యర్థి, టీడీపీ బలపర్చిన బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రాంమోహన్రావు 47,041 ఓట్లు సాధించారు. మొదటి రౌండ్లో అధికార పార్టీ అభ్యర్థి 12,723 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి చింతపండు నవీన్కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు 13,033 ఓట్లు వచ్చాయి. వామపక్షాల అభ్యర్థి సూరం ప్రభాకర్ రెడ్డి 11,580 ఓట్లు దక్కించుకున్నారు. దీంతో రెండో ప్రాధాన్యతా ఓటు కోసం తిరిగి లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. అతి తక్కువ ఓట్లు పొందిన అభ్యర్థి ఖాతా నుంచి రెండో ప్రాధాన్యత ఎవరికి వచ్చిందో గుర్తించి వారికి ఓట్లను బదలాయిస్తూ వెళ్లారు. ఎలిమినేషన్ ప్రక్రియలో 20వ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఓట్ల బదలాయింపు సగం పూర్తి కాగానే రాజేశ్వర్ మ్యాజిక్ ఫిగర్ 66,777కు చేరుకున్నారు. దాంతో, ఆయన గెలిచినట్లు ప్రకటించారు. ఇక బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రాంమోహన్రావుకు 55,004 ఓట్లు వచ్చాయి. కాగా ఫలితం ప్రకటించిన తర్వాత సీఎం కేసీఆర్ ఆచరణలో పెట్టిన పథకాలే తన గెలుపునకు ఉపయోగపడ్డాయని ఎమ్మెల్సీగా విజయం సాధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.
Tags:    
Advertisement

Similar News